Breaking News

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ తో సంబంధాలు తెంచుకుంటాం.. ప్రసారభారతి

27 th Jun 2020, UTC

ప్రముఖ వార్తా సంస్థ ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ (పీటీఐ) జాతి వ్యతిరేక పాత్రికేయం చేస్తోందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతి ఆరోపించింది. ఆ సంస్థతో సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించింది.

చైనా రాయబారి సున్ వీడోంగ్ ఇంటర్వ్యూను పీటీఐ ప్రచురించిన నేపథ్యంలో ప్రసార భారతి ఈ హెచ్చరిక చేసింది. సున్ వీడోంగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జూన్ 15 రాత్రి జరిగిన భారత-చైనా సైనికుల ఘర్షణకు కారణం భారత దేశమేనని ఆరోపించారు. 20 మంది భారత సైనికులు మరణించడానికి  కారణం భారత దేశమేనని ఆరోపించారు.

దీనితో పీటీఐ యాంటీ నేషనల్ రిపోర్టింగ్ చేస్తుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రసార భారతి లేఖ రాసింది. పీటీఐ సంపాదకీయ వైఖరి ఆ సంస్థతో సంబంధాలను కొనసాగించేందుకు సమర్థనీయంగా లేదని ఈ లేఖలో పేర్కొంది.

 ప్రసార భారతి అనేక దశాబ్దాలుగా పీటీఐకి మద్దతుగా నిలుస్తోంది. ఆర్థికంగా కోట్లాది రూపాయలు అందజేస్తోంది. . పీటీఐతో తెగదెంపుల గురించి త్వరలోనే ప్రసార భారతి ప్రకటించబోతోందని మరొక వార్తా సంస్థ తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox