Breaking News

పెళ్లి బహుమతిగా ఏకే 47

28 th Nov 2020, UTC
పెళ్లి బహుమతిగా ఏకే 47

పాకిస్తాన్ :సాధారణంగా పెళ్లిలో ఇచ్చే బహుమతలు అంటే విలువైన ఆభరణాలు, డబ్బులు, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులు, అలంకరణ సామాగ్రి వంటివి ఉంటాయి. వెరైటీ గిఫ్ట్‌లు ఇచ్చే వారు కూడా ఉంటారు. కానీ మరణాయుధాలను బహుమతులుగా ఇవ్వడం గురించి ఇంతరకు చూడలేదు. పాకిస్తాన్ లో జరిగిన పెళ్లిలో ఒక మహిళ వరుడికి ఏకే 47 రైఫిల్‌ని బహుమతిగా ఇచ్చింది. దీనికే ఆశ్చర్యంగా ఉంటే అది చూసి అక్కడ ఉన్న వారంతా సంతోషంతో చప్పట్లు కొట్టడం మరో విశేషం. ఈ వీడియోను ‘‘వివాహ బహుమతిగా కలాష్నికోవ్ రైఫిల్" అనే ట్యాగ్ లైన్‌తో ట్విట్టర్లో షేర్ చేశారు.

ట్విట్టర్‌లో వైరల్ అయిన ఈ పోస్టును ఇప్పటివరకు 1.88 లక్షల మందికి పైగా చూడగా 2.5 వేల మంది లైక్స్ ఇచ్చారు. వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నెటిజన్ “బహుమతిని చూసి వధువు భయపడిందా? ఆమె సురక్షితంగా ఉందా?’’ అని అడిగాడు. మరొక నెటిజన్ బహుమతిని చూసి వధువు అసౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు‘ఈ బహుమతిని అమ్మాయికి ఇస్తే బాగుండేది. అలా అయినా అత్తింటి వారు ఆమెను జాగ్రత్తగా చూసుకునేవారు. బహుమతి తీసుకున్నావ్‌ బాగానే ఉంది కానీ పరీక్షించాలని మాత్రం చూడకు నాయనా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేసారు. మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox