Breaking News

ఫేస్‌బుక్‌ సీఈఓకు పాక్ ప్రధాని లేఖ

26 th Oct 2020, UTC
ఫేస్‌బుక్‌ సీఈఓకు పాక్ ప్రధాని లేఖ

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌ సీఈఓకు సోమవారం లేఖ రాశారు. సోషల్‌ మీడియా వేదికపై ఇస్లాం వ్యతిరేక కంటెంట్‌ను నిషేధించాలని కోరారు. ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఇస్లామోఫోబియా పెరిగిపోతుండటం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను ప్రేరేపిస్తోందని సోషల్‌ మీడియా దిగ్గజానికి రాసిన బహిరంగ లేఖను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌ వేదికగా ఇస్లామోఫోబియో, ఇస్లాంపై విద్వేష కంటెంట్‌ను నిషేధించాలని ఆయన కోరారు.

ఫ్రాన్స్‌లో ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెడుతున్నారని  ఇమ్రాన్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ విద్వేష సందేశాలను పంపడం ఆమోదయోగ్యం కాదని పక్షపాతంతో కూడిన ఇలాంటి ఘటనలు హింసాప్రవృత్తిని మరింత పెంచుతాయని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్‌ లేఖపై ఫేస్‌బుక్‌ ప్రతినిధి స్పందిస్తూ ఏ రూపంలోనైనా విద్వేషాన్ని తాము వ్యతిరేకిస్తామని, మతం, వర్ణం, జాతి ప్రాతిపదికన దాడులను అనుమతించమని స్పష్టం చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox