Breaking News

టిక్ టాక్ బాన్ ను ఎత్తేసిన పాకిస్థాన్..!

19 th Oct 2020, UTC

పాకిస్థాన్ :అనైతిక, అశ్లీల కంటెంట్‌ బయటకు వస్తోందంటూ ఇటీవల పాకిస్థాన్ కూడా టిక్ టాక్ పై బాన్ విధించిన సంగతి తెలిసిందే. అసలే, భారత్, అమెరికా దేశాలు టిక్ టాక్ పై బాన్ విధించిన నేపధ్యంలో పాకిస్థాన్ కూడా టిక్ టాక్ ని బాన్ చేయడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అయింది టిక్ టాక్ పరిస్థితి. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం టిక్ టాక్ కు ఊరటనిచ్చే వార్తని చెప్పింది.

ఈ ఆప్ పై విధించిన నిషేధాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అశ్లీల, అనైతిక కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న ఖాతాలను బ్లాక్ చేస్తామని టిక్ టాక్ హామీ ఇచ్చింది. ఈ హామీతో కన్విన్స్ అయినా పాక్ ప్రభుత్వం బాన్ ను ఎత్తేయడానికి అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ టెలికం అథారిటీ  ఓ ప్రకటన చేసింది. పది రోజుల క్రితం టిక్ టాక్ ఆప్ వలన అనైతిక, అశ్లీల కంటెంట్‌ బయటకు వస్తోందని పాక్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అనంతరం ఈ ఆప్ వినియోగాన్ని పాకిస్థాన్ లో నిషేధం విధించింది. దీనితో టిక్ టాక్ అభ్యంతకర కంటెంట్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. పాకిస్థాన్ లో సేవలు మెరుగుపరుచుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని టిక్ టాక్ హామీ ఇచ్చింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox