Breaking News

పాకిస్తాన్ అంతే.. అసలేమీ లేకుండానే వెనక్కి లాగుతుంది..!

28 th Oct 2020, UTC

పాకిస్థాన్ చేసే పనులు చూస్తుంటే ఒక్కోసారి విపరీతమైన నవ్వు వస్తుంటుంది. ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతుండడం పాక్ కి కొత్తేమి కాదు. ఇటీవల పాకిస్తాన్ చేసిన పనికి ప్రపంచం షాక్ అయింది. ఇటీవల పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని చేసింది. మహమ్మద్ ప్రవక్త కార్టూన్ ని ఫ్రాన్స్ అధ్యక్షుడు సమర్ధించడంతో పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇస్లాం మతాన్ని అవమానించారని మండిపడింది. అంతటితో ఆగకుండా ఫ్రాన్స్ నుంచి తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంటామని అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. 

తీర్మానం చేయడంలో ఏముంది అనుకుంటున్నారా? అసలు ఫ్రాన్స్‌లో తమ రాయబారి ఎవరు లేరని పాకిస్థాన్ మర్చిపోయినట్లుంది. ఫ్రాన్స్ నుంచి రాయబారిని వెనక్కి పిలిపించడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు సరే. కానీ అసలు అక్కడ పాకిస్థాన్ కి రాయబారే లేరు అన్న విషయాన్నీ చట్ట సభ్యులు సైతం మర్చిపోవడంతో ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇందులో విశేషమేమిటంటే పాకిస్థాన్ కి ఫ్రాన్స్ లో రాయబారి ఎవరు లేరని, ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి తెలుసు. తెలిసినా, ఆయన ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మూడు నెలల క్రితమే, పాకిస్థాన్ ఫ్రాన్స్ నుంచి తమ రాయబారిని చైనాకు బదిలీ చేసింది. అప్పటినుంచి ఫ్రాన్స్ లో పాకిస్థాన్ కు రాయబారి లేరు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox