Breaking News

 పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయి.. అభినందన్ ను వదలిపెట్టారు.

29 th Oct 2020, UTC

ఏడాది కిందట పాక్ విమానాలపై దాడిచేస్తూ  భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ ను  పాక్ భూబాగంలో దికి వారికి చేతికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే తరువాత పరిణామాలలో పాక్ అభినందన్ ను గౌరవంగా సరిహద్దుకు తీసుకువచ్చి అప్పగించింది, తన సాహసానికి గాను అభినందన్ కు కేంద్రం పరమ్ వీర్ చక్ర అవార్డు కూడ ఇచ్చింది. అయితే అభినందన్ వర్దమాన్ ను  అప్పగించకపోతే  భారత్ దాడి చేస్తుందని పాక్ భయపడిందా? యుద్దం వస్తే భారత్ ను  ఎదర్కోలేమని భావించిందా? అంటే అవుననే  తెలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ నాయకుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ (పిఎంఎల్-ఎన్) నాయకుడు అయాజ్ సాదిక్  మాట్లాడుతూ అభినందన్ వర్దమాన్ పాక్ చేతికి చిక్కిన తరువాత ఉన్నత స్దాయి అధికారుల సమావేశం జరిగిందని తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి, ఆర్మీ చీఫ్  కమర్ జావేద్ బజ్వా , పిపిపి, పిఎంఎల్ ఎన్  పార్టీ నాయకులు హాజరయిన ఈ సమావేశానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. 

ఈ సమావేశంలో ఖురేషి మాట్లాడుతూ అభినందన్ ను వదలకపోతే భారత్ రాత్రి 9 గంటలకు పాక్ పై దాడి చేసే అవకాశముందని హెచ్చరించారు. సమావేశంలో వున్న పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా కాళ్లు వణికి పోయాయి. ఆయనకు చెమట్లు పట్టాయి.  చివరకు అభినందన్ ను వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటూ సాదిక్ వివరించారు.వింగ్ కమాండర్ వర్దమాన్  సహా అన్ని సమస్యలలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని ఆయన గుర్తు చేసారు. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox