Breaking News

కువైట్ లో విద్యార్దులు, నర్సులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు

30 th Sep 2020, UTC

డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో గల్ఫ్ దేశమైన కువైట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ విద్యార్థులు, నర్సులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. మంత్రివర్గ తీర్మానం 270(2020) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ మరియు కార్యకలాపాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ జమాల్ అల్ సయ్యేఘ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇక నుంచి వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరని తెలిపారు. ఈ నిర్ణయం మార్చిలోనే తీసుకున్నప్పటికీ మహమ్మారి కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox