Breaking News

కరోనా జీరో దేశంగా న్యూజిలాండ్..!

09 th Jun 2020, UTC
కరోనా జీరో దేశంగా న్యూజిలాండ్..!

కరోనా మహమ్మారి ని జయించినట్లు న్యూజిలాండ్‌ ప్రకటించింది చిట్టచివరి కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తికూడా కోలుకున్నట్టు వైద్య అధికారులు సోమవారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ జీరో అయింది. గత పదిహేడు రోజులుగా 40,000 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

50 లక్షల జనాభాగలిగిన న్యూజిలాండ్‌లో మొత్తం 3లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి చివరినుంచి చూస్తే సోమవారం న్యూజిలాండ్‌లో ఒక్క యాక్టివ్‌ కేసుకూడా లేదని ప్రధాని  జసిండా ఆర్డెర్న్‌ప్రకటించారు.ప్రస్తుతానికైతే న్యూజిలాండ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలిగింది. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇది నిరంతర ప్రక్రియ అని మీడియా సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారు.

దేశంలో మళ్ళీ కేసులు బయటపడే అవకాశం కూడా లేకపోలేదనీ, అంత మాత్రాన మనం కరోనా కట్టడిలో విఫలమైనట్టు కాదనీ, అది వైరస్‌ వాస్తవికతగా  అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.  అర్థరాత్రి నుంచి దేశంలో కోవిడ్‌ ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. న్యూజిలాండ్‌ భౌగోళిక స్వరూపం రీత్యా ప్రత్యేకంగా ఉండడం వంటి అనేక కారణాల రీత్యా కరోనాని కట్టడిచేయగలిగారని నిపుణులంటున్నారు.  దేశంలో 1,500 మందికి కరోనా సోకగా, అందులో 22 మంది మరణించారు. 

 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox