Breaking News

చైనా చట్టానికి మద్దతిస్తున్న నేపాల్..!

04 th Jun 2020, UTC
చైనా చట్టానికి మద్దతిస్తున్న నేపాల్..!

స్వతంత్ర దేశం గా ఉన్న హాంకాంగ్ ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకోసం చైనా పెద్ద స్కెచ్ నే వేసింది. హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా జాతీయ భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టింది. అయితే.. దీనికి మద్దతు ఇస్తున్నట్లు నేపాల్ ప్రకటించింది. హాంకాంగ్ కూడా చైనా లో అంతర్భాగమని.. చైనా ''ఒక దేశం- రెండు వ్యవస్థలు'' విధానాన్ని అవలంబిస్తోందని..అంటూ చైనా చేస్తున్న పనులకు అనుకూలం గా నేపాల్ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై నేపాల్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ''శాంతి- భద్రతలు కాపాడటమనేది పాలకుల ప్రాథమిక బాధ్యత. అక్కడ శాంతి భధ్రతలకై చైనా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్లు నేపాల్ తెలిపింది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకై చైనా చేస్తున్న ప్రయత్నాలకు నేపాల్‌ మద్దతు పలుకుతోంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని నేపాల్‌ భావిస్తుంది అని నేపాల్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox