Breaking News

నేపాల్ కొత్త మాప్ కు విపక్షాల మద్దతు...!

10 th Jun 2020, UTC
నేపాల్ కొత్త మాప్ కు విపక్షాల మద్దతు...!
భారతీయులకు మానస సరోవర్‌ ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేందుకు ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో లిపులేక్‌ లోయద్వారా తలపెట్టిన నూతన రహదారి మార్గాన్ని నేపాల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపిధురియా ప్రాంతాలను తమ అంతర్గత భూభాగాలుగా చూపుతూ నేపాల్ ఇటీవల కొత్త మ్యాప్‌ రూపొందించడంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. అయితే.. ఈ విషయమై గత కొంతకాలం గా నేపాల్ కు భారత్ కు మధ్య రగడ మొదలైన సంగతి తెలిసిందే. 
 
           ఆర్టికల్ 370ను రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ తరవాత భారత ప్రభుత్వం కొత్త మ్యాప్‌ విడుదల చేసింది. ఆ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేక్‌ ప్రాంతాలు ఉండటాన్ని నేపాల్‌ తప్పుపట్టింది. గతంలో చేసుకొన్న ఒప్పందాలకు ఆ చర్య విరుద్ధమన్న నేపాల్‌ విమర్శలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. వెనుక మరెవరో ప్రోద్భలం తోనే..నేపాల్ నాయకులు సరిహద్దు గొడవకు దిగుతున్నారని... చైనాను వేలెత్తి చూపించింది. 
 
          అయితే.. ఈ విషయం లో నేపాల్ మాత్రం పట్టు విడవలేదు. లిపులేఖ్‌, కాలాపానీ, లింపిధురియా ప్రాంతాలను తమ మాప్ లో చూపిస్తూ ఇటీవల విడుదల చేసిన కొత్త మాప్ పై తాజాగా విపక్షాలు మద్దతు తెలిపాయి. త్వరలోనే దీనిపై ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు.. రాజ్యాంగ సవరణ పనులు కూడా మొదలు పెట్టింది. విపక్షాలు మద్దతు తెలిపినా రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సవరణలను సూచించడానికి సభ్యులకు ఇంకా 72 గంటలు గడువు ఉండగా.. రాజ్యాంగ సవరణను ఉభయ సభలలో 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. అయితే.. తుది ఓటింగ్ కు మరి కొన్ని రోజులు పెట్టె అవకాశం ఉంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox