Breaking News

ఫ్రాన్స్ అధ్యక్షుడి పై మండిపడుతున్న ముస్లింలు..!

31 st Oct 2020, UTC

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పై పలు ఇస్లానిక్ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాలయితే ఫ్రాన్స్ ఉత్పత్తులనే బాన్ చేసాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన దిష్టిబొమ్మలను ఇస్లానిక్ దేశాలు దగ్ధం చేస్తున్నాయి. ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ, టర్కీ, పాక్‌ దేశాలు సైతం ఓ రేంజ్ లో మండిపడుతున్నాయి.
 
అసలు ఈ వివాదానికి కారణమేంటంటే ఫ్రాన్స్‌లో శామ్యూల్‌ పాటీ అనే టీచర్ ను నిందితుడు గొంతు కోసి చంపాడు. ఆ టీచర్ మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను విద్యార్థులకు చూపించాడన్న కారణంతో అతనిని దారుణంగా హత్య చేసాడు. పోలీస్ లు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసిన తరువాత ఆ నిందితుడే ఈ విషయాన్నీ స్వయంగా తెలిపాడు. ఈ హత్య పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్పందించాడు. ఇది ఇస్లామిక్ టెర్రరిజం అని ఆయన వ్యాఖ్యానించడంతో పలు ఇస్లామిక్ దేశాలు మండిపడ్డాయి. ప్రవక్త కార్టూన్‌లను చూపించిన టీచర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర సత్కారం కూడా అందచేయబడింది. ఈ కార్యక్రమానికి మాక్రాన్ కూడా హాజరు అయ్యారు. 

ఫ్రాన్స్‌లో ముస్లిం సంస్థలపై చర్యలు కూడా తీసుకున్నారు. కొన్ని మసీదులపై దాడులు కూడా జరగడంతో ఇస్లామిక్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. దీనితో ఇస్లామిక్ దేశాలలో పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మాక్రాన్ ఇస్లాం ద్వేషి అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. జరిగిన దుర్ఘటనని ఖండించకుండా మాక్రాన్ ఇది ఇస్లామిక్ టెర్రరిజం అని వ్యాఖ్యానించడం పట్ల కూడా ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox