Breaking News

పాక్ పార్లమెంట్ లో మోడీ జపం.. నిజమేనా..?

30 th Oct 2020, UTC

పాకిస్థాన్ :ఇటీవల ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పాక్ పార్లమెంట్ లో నిత్యం భారత్ కు వ్యతిరేకంగా ఏమి చేయాలనీ చర్చలు జరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ భారత్ పేరు వినపడితే. పార్లమెంట్ పెద్దలు కస్సుబుస్సుమంటుంటారు. పుల్వామా దాడి భారతీయులను కలవర పెట్టడమే కాదు. పాకిస్థానీయులపై మరింత ద్వేషం పెంచుకునేలా చేసింది. ఈ దాడి జరిగాక భారత్ సైలెంట్ గా ఉండలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్ లో మెరుపుదాడులు జరపడంతో పాకిస్థాన్ కి భారత్ పై మరింత ద్వేషం పెరిగింది. ఆ దాడుల వెనక ఉన్న ప్రధాని మోడీ పేరు చెబితే అక్కడి చట్టసభ్యులకు మాట రాదు. అలాంటిది అక్కడి అత్యున్నత చట్ట సభలో మోడీ పేరు మారుమ్రోగిపోయిందంటూ ఇటీవల ఓ వార్త నెట్టింట్లో తిరుగుతోంది. 

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో అధికార పక్ష సభ్యులలో ఒక వ్యక్తి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు అక్కడే కూర్చున్న మిగతా సభ్యులు 'మోడీ మోడీ మోడీ'  అని అరుస్తున్నారని ఈ వార్తల్లో పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సభ్యులు కూడా దీనిని సమర్ధించారని కూడా ఈ కధనాలు పేర్కొన్నాయి. అయితే పలువురు నెటిజన్లు ఇది ఇబ్బందికర పరిణామం అని కామెంట్ లు చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం మరోలా ఉంది.

పాకిస్థాన్ పార్లమెంట్ లో అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. అయితే అక్కడి సభ్యులు ఆ అంశం పై ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పలువురు ఎంపీలు 'ఓటింగ్ ఓటింగ్ ఓటింగ్'అని అరిచారు. ఈ వీడియోనే కొంత మార్చి "మోడీ మోడీ" అని వచ్చేలా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox