Breaking News

చైనా సైనికులను దీటుగా నిలువరించాం... మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

28 th Jun 2020, UTC
చైనా సైనికులను దీటుగా నిలువరించాం... మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

 ప్రధాని మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ లడఖ్‌లో చైనా సైనికులను దీటుగా నిలువరించామని అన్నారు. డ్రాగన్‌ సేనలతో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారని  అన్నారు.దేశం స్వయం సమృద్ధి సాధించేలా పౌరులంతా చొరవ చూపాలని పిలుపు ఇచ్చారు.

ఈ ఏడాది మనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని అన్నారు. ప్రపంచమంతా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించగా, ఇమ్యూనిటీని పెంచేవన్నీ భారత్‌లో ఎప్పటినుంచో వాడుతున్నవేనని గుర్తించాలన్నారు.స్దానిక ఉత్పత్తుల వాడకానికే మొగ్గుచూపాలని కోరారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్‌ బలోపేతమవుతోందని అన్నారు

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. . చరిత్ర, సాహిత్యం, విజ్ఞానశాస్త్రంలో ఆయనకు చాలా ఆసక్తి. భారతదేశపు అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరైన పీవీకి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.

సంక్లిష్ట సమయంలో దేశానికి నాయకత్వం వహించిన పీవీ గొప్ప రాజకీయ నేతే కాకుండా పండితుడని అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox