Breaking News

రేపు అంతరిక్షంలో అద్బుతం.. ఒకే వరుసలో కనపడనున్న 5 గ్రహాలు

23 rd Jun 2022, UTC

అంతరిక్షంలో శుక్రవారం అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయిదు గ్రహాలు ఒకే సరళరేఖలో కనిపించనున్నాయని  ఖగోళశాస్త్ర పరిశోధకులు వెల్లడించారు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయన్నారు. ఈ 5 గ్రహాలు 2004 డిసెంబర్ లో ఇలా ఒకే సరళరేఖలో కనిపించి కనువిందు చేశాయి.

మళ్లీ 18 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని అంతరిక్షంలో మరోసారి శుక్రవారం చూడొచ్చు. ఇలా గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు. గంట సమయం ఈ 5 గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి. దీన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు చూడొచ్చు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox