Breaking News

మినియాపొలిస్‌ నగరంలో పోలీసు వ్యవస్థ రద్దు..!

10 th Jun 2020, UTC
మినియాపొలిస్‌ నగరంలో పోలీసు వ్యవస్థ రద్దు..!

నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్‌ను పోలీసు అధికారి చంపిన సంఘటన జరిగిన మినియాపొలిస్‌ నగరంలో మొత్తం పోలీసు వ్యవస్థనే రద్దు చేయాలని స్థానిక నగర పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం సిటీ పార్క్‌ వద్ద జరిగిన భారీ ర్యాలీలో పాలక మండలిలోని 12 మంది సభ్యుల్లో 9 మంది పాల్గొన్నారు. పాలక మండలి అధ్యక్షురాలు నగర పోలీసు వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు.

పోలీసు వ్యవస్థను సంస్కరిద్దామనుకున్నామని, అది సాధ్యం కాలేదని, అందుకే, రద్దు చేసి, నగర పౌరులకు నచ్చిన విధంగా కొత్త పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని,  ప్రజలను సురక్షితంగా ఉంచేలా పనిచేసే కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామని సిటీ కౌన్సిల్‌ అధ్యక్షుడు లిసా బెండర్‌ తెలిపారు .2000 సంవత్సరంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని క్యాంప్టన్‌, 2012లో న్యూజెర్సీ రాష్ట్రంలోని క్యాండెన్‌లో ఈ విధంగా మొత్తం పోలీసు వ్యవస్థను రద్దు చేసి, కొత్త పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

. ప్రస్తుత వ్యవస్థ సమాజానికి ఏమాత్రం రక్షణ కల్పించడం లేదని, పోలీస్‌ విభాగం రద్దుకు సిటీ కౌన్సిల్‌ సభ్యులు అత్యధికం మద్దతిస్తున్నారని తెలిపారు. గత నెల 25న మినియాపోలిస్‌ పోలీస్‌ అధికారి డెరెక్‌ చావెన్‌ అమానుష ప్రవర్తన  కారణంగా ఫ్లాయిడ్‌ మరణించిన విషయం తెలిసిందే

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox