Breaking News

లండన్ లో లాక్ డౌన్..!

16 th Oct 2020, UTC
లండన్ లో లాక్ డౌన్..!

లండన్ :కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భయాందోళనలను రేకెత్తిస్తోంది. బ్రిటన్ రాజధాని లండన్ లో మరో సారి లాక్ డౌన్ అమలు అవుతోంది. అక్టోబర్ 16 అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ ప్రకటన చేసారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కొన్ని దేశంలో సెకండ్ వేవ్ ప్రారంభం అయింది. దీనితో హెచ్చు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి.

బ్రిటన్ రాజధాని లండన్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో అక్కడి వారు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కరోనా కేసుల సంఖ్యా రెట్టింపవుతోంది. ఈ నేపధ్యంలో నగరంలో మరో సారి లాక్ డౌన్ ని అమలు చేయాలనీ నిర్ణయించారు.రెండు మూడు వారాల పాటు ఈ లాక్ డౌన్ ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్ డౌన్ అమలు కాబోతోందని ప్రకటన చేసారు. 

లాక్ డౌన్ ఆంక్షల ప్రకారం ఇతరుల ఇళ్లకు వెళ్లడం కానీ ఇతరులను ఇళ్లకు ఆహ్వానించడం కానీ పూర్తిగా నిషేధం ఇండోర్, అవుడ్ డోర్స్‌లో గ్రూప్ సమావేశాలు జరపకూడదు. అవసరం అయితే తప్ప. అసలు బయటకు రాకూడదు. అది కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ యూజ్ చేయకుండా కాలినడకన లేదా సైకిల్‌పై మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. విద్యాలయాలు, యూనివర్సిటీలు, ప్రార్థనా మందిరాలను మాత్రం తెరిచే ఉంచుతారు. పబ్స్ రెస్టారెంట్స్ కూడా తెరిచే ఉంటాయి. అయితే ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసిన ఆరుగురికి మించి ఉండకూడదు. 9 మిలియన్ల జనాభా ఉన్న లండన్ నగరంలో  ప్రస్తుతం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని ఆంక్షలు అమలు చేయకపోతే, మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదని యూకే హెల్త్ సెక్రటరీ హన్‌కాక్ తెలిపారు. మరో వైపు ఫ్రాన్స్ లో కూడా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వెంటాడుతోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox