King Charles III: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపు చూస్తుంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందిక్కడ. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం పూర్తయ్యాక.. ఆయన సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందజేయనున్నారు.
కృతజ్ఞతా బహుమతులు
ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపు చూస్తుంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందిక్కడ. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం పూర్తయ్యాక.. ఆయన సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందజేయనున్నారు.
వెస్ట్‌మినిస్టర్ లోని అబేలో ఈ వేడుక అట్టహాసంగా సాగుతోంది. ఈ పట్టాభిషేకానికి ప్రపంచనలువైపుల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక మెుత్తం పూర్తయ్యాక బ్రిటన్ రాజు సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందించనున్నారు.
ఈ పట్టాభిషేక వేడుకలో పాల్గొన్న వివిధ శాఖల సిబ్బందికి.. అలాగే దేశానికి సేవ చేస్తున్న పలు శాఖలకు చెందిన వారికి వీటిని అందించనున్నట్లు బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ తెలిపారు. ఇందుకోసం ఛార్లెస్, కెమిల్లా ప్రతిమలతో కూడిన పతకాలను తయారు చేశారు.
ఈసారి రాజు హోదాను సూచిస్తూ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు బహూకరించే చిహ్నాల్లో తొలిసారిగా హిందూ, జైన, సిక్కు తదితర మతాలకు చెందినవి కూడా ఉండబోతున్నాయి. పట్టాభిషేకం సందర్భంగా ఛార్లెస్ అన్ని సమాజాలకు సేవ చేసే సార్వభౌమాధికారం కోసం గట్టిగా ప్రార్థించనున్నారు. కార్యక్రమంలో హిందువులు, యూదులు, సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు తదితర మత ప్రతినిధుల నుంచి ఛార్లెస్ అభినందనలు స్వీకరిస్తారు.