Breaking News

కైలాషియన్ కరెన్సీ..!

23 rd Aug 2020, UTC
కైలాషియన్ కరెన్సీ..!

కైలాస:  క‌ర్ణాట‌క‌తో సహా, ఇండియాలో పలుచోట్ల - క్రిమిన‌ల్ కేసుల‌తోపాటు ఓ రేప్ కేసులోనూ ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న స్వామి నిత్యానంద గుర్తున్నాడుక‌దా? అవును అత‌నే.. అక్క‌డెక్క‌డో ఈక్వెడార్ వ‌ద్ద ఓ దీవిని కొనుగోలు చేసి, కైలాస అనే కొత్త దేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఆ నిత్యానందే ఇప్పుడు ఏకంగా ఓ బ్యాంకునే ఏర్పాటు చేశాడు. మ‌న దేశంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా - అక్క‌డ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస‌ను ఏర్పాటు చేశాడు. ఇప్ప‌టికే త‌న దేశ క‌రెన్సీని విడుద‌ల చేసిన నిత్యానంద - వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా ఆ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు.

నిత్యానంద స్వామి అంటే అత్యాచారాలు, కిడ్నాప్ కేసులు గుర్తుకొస్తాయి . ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్న వివాదాస్ప‌ద స్వామి చ‌క్క‌గా ఓరోజు  దేశం విడిచి - మాన‌వ ప్ర‌పంచానికి దూరంగా వెళ్లిపోయాడు. తానే దైవాంశ సంభూతుడిన‌ని భావించే నిత్యానంద‌ - ప్ర‌త్యేకంగా ఓ దేశాన్ని సృష్టించున్నాడు. దానికి కైలాస దేశం అని చ‌క్క‌గా నామ‌క‌ర‌ణం చేశాడు. అంత‌టితో ఆగాడా... అబ్బే, ఖాళీగా ఉండ‌డం నిత్యానందుడి డిక్ష‌న‌రీలోనే లేదు. ప్ర‌పంచాన్ని అబ్బుర‌ప‌రిచేలా ఆయ‌న మాయ‌లు కొన‌సాగుతున్నాయి.

నిత్యానందకు క‌ర్ణాట‌క‌లోని బిడిదిలో ప్ర‌ధాన ఆశ్ర‌మం ఉంది. అత‌ను, అత‌ని వ‌ద్ద ప‌నిచేసే మ‌రో ఇద్ద‌రు శిష్యుల‌పై సెక్షన్ 376 రేప్ కేసు‌, సెక్షన్ 377 అన్‌నాచుర‌ల్ సెక్స్‌ కేసుతోపాటు - 114 సెక్ష‌న్ల కింద కేసులు నమోదై ఉన్నాయి . అహ్మ‌దాబాద్‌లోని ఆశ్ర‌మంలో కిడ్నాప్‌, చిన్నారుల ప‌ట్ల‌ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మ‌హిళ‌ను రేప్ చేయ‌డం వంటి నేరాల్లో ఆయా కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌నికి ఇచ్చిన‌ బెయిల్ ను కూడా క‌ర్ణాట‌క హైకోర్టు ర‌ద్దు చేసింది. త‌రువాత అత‌ను కోర్టుల్లో 50 సార్లు విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అనంత‌రం, గ‌తేడాది న‌వంబ‌ర్‌లో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. త‌రువాత ఈక్వెడార్ వ‌ద్ద ఓ దీవిని కొని కైలాస దేశాన్ని ఏర్పాటు చేశాడు.

సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకొని సంచలనం సృష్టించిన నిత్యానంద - ఇప్పుడు సొంత కరెన్సీని కూడా విడుదల చేశారు. దానిని వినాయక చవితి రోజు ఆవిష్కరించారు. ఆ కరెన్సీ పేరు ‘కైలాషియన్ డాలర్’. కేవలం కరెన్సీయే కాదు సుమా... మరో రిజర్వ్ బ్యాంకును కూడా స్థాపించారు. దాని పేరు ‘‘బ్యాంక్ ఆఫ్ కైలాస’’.  

ఆగస్టు 22 , వినాయక చవితి రోజున తన సొంత దేశమైన కైలాసలో బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు నిత్యానంద ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాసను ప్రారంభించిన నిత్యానంద కైలాస దేశానికి సంబంధించిన నాణేలను కూడా విడుదల చేశారు.

   కైలాస దేశ కరెన్సీ అన్ని చోట్ల చెల్లుబాటు కాదని, తాను ఒప్పందం చేసుకున్న దేశాల్లో మాత్రమే చెల్లుబాటు అవుతుందని నిత్యానంద వెల్లడించారు. అయితే , అన్ని దేశాల కరెన్సీ - కైలాసలో చెల్లుబాటు అవుతుందని చెప్పారు . భూమిపై  56 హిందూ దేశాలు ఉన్నాయని, వాటితోనే తాము ఆర్థిక లావాదేవీలు సాగించేందుకు మొగ్గుచూపుతామని చెప్పుకొచ్చారు. ‘‘పాండ్య, చోలా, కన్నడ, తెలంగాణ, గుర్జానా, సురంగి, కాశీ , కంబోడియా , శ్రీలంక , ఆఫ్గనిస్తాన్  , నేపాల్ ’’ వీటన్నింటినీ హిందూ దేశాలుగా నిత్యానంద అభివర్ణించారు. నిత్యనంద లిస్టులో తెలంగాణ రాష్ట్రం కూడా ఓ హిందూ దేశంగా ఉంది.

అయితే కైలాస ప్రస్తుతం ఆ 56 దేశాలను హిందూ దేశాలుగా ప్రకటించడం లేదని నిత్యానంద అన్నారు. తాము ఏ దేశానికి, మతానికి వ్యతిరేకంగా కాదని.. కానీ, హిందూయిజాన్ని నెలకొల్పడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. తనపై ఇండియాలో కుట్రపూరిత దాడి జరుగుతోందని, అందుకే అక్కడి నుంచి వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే కైలాస దేశానికి రెండు భాషలు ఉంటాయని నిత్యానంద చెప్పారు. మాట్లాడే భాషగా తమిళం ఉంటుందని.. ఆధ్యాత్మిక, జ్ఞాన సముపార్జనకు సంస్కృతం ఉంటుందని పేర్కొన్నారు. కైలస దేశానికి డాలర్ కరెన్సీగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పావు డాలర్ నుంచి 10 డాలర్ల వరకు నాణేలను విడుదల చేశారు.  ఇప్పటికే కైలాస దేశానికి జాతీయ జెండా, జాతీయ చిహ్నం, వీసా, పాస్పోర్ట్ నిత్యానంద రూపొందించిన విషయం తెలిసిందే. హిందూ ధర్మాన్ని నెలకొల్పడమే తన ధ్యేయంగా చెప్పుకొచ్చే నిత్యానంద తాను జీవ సమాధి అయ్యేది బెంగుళూరులోని బిడది ఆశ్రమంలోనే అని స్పష్టం చేశారు. సంపూర్ణ హిందూ ధర్మాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని వెల్లడించిన నిత్యానంద దానికోసం చివరి వరకు పోరాడతానని వెల్లడించారు.

అయితే, స్వాములోరికి ఇవ‌న్నీ చేయ‌డం ఎలా సాధ్యం? అన్నది మాత్రం స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌గా మిగులుతోంది. మ‌న దేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో త‌నకు తానుగా ఓ దేశాన్ని సృష్టించుకోవ‌డం, అందుకు త‌గ్గ‌ట్టు చ‌ట్టాలు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్మించ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు.  
నిత్యానంద స్వామి కొలువుదీరిన కైలాస దేశంలో నిజ‌మా?క‌లా ? అన్న‌ట్టు కొత్త వ్య‌వ‌స్థ‌ను ఎలా ఏర్పాటు చేయ‌గ‌లిగాడు? ఎవ‌రైనా అక్క‌డికి వెళ్లి - అస‌లేం జరుగుతోందో చూసిన వాళ్లు లేర‌నే చెప్పాలి. ఎంత‌సేపూ నిత్యానంద‌స్వామి అనుచ‌రులు విడుద‌ల చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లే ప్ర‌పంచానికి దిక్కు అయ్యాయి. ఇంత‌టి క‌రోనా స‌మ‌యంలోనూ నిత్యానంద‌స్వామి ప్ర‌త్యేక దేశం, క‌రెన్సీ, ప్ర‌పంచ దేశాల‌తో ఒప్పందాలు, చ‌ట్టాలు అంటూ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లో ఏదో మాయా ప్ర‌పంచాన్ని త‌ల‌పిస్తోంది.
మరి , స్వాములోరు మున్ముందు ఇంకెన్ని లీలలు చూపిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox