Breaking News

బై డెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళ!

21 st Nov 2020, UTC

వాషింగ్టన్ :అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి మహిళలు కీలక పదవులు చేజిక్కించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో జొబైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలహరిస్ ఎన్నికవనున్నారు. తాజాగా, శ్వేత సౌధం పాలక వర్గం లో మరో భారత సంతతి మహిళకు చోటు దక్కింది. కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలాను నియమించనున్నారు. ఈ మేరకు జో బైడెన్ శుక్రవారం ఓ ప్రకటనను చేసారు.

మాలా గతంలో జిల్‌కు సీనియర్‌ సలహాదారుగా, బైడెన్‌-కమలా ప్రచార బృందంలో సీనియర్‌ పాలసీ సలహాదారుగా పనిచేసారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా మాలా పలు బాధ్యతలు నిర్వర్తించారు. మాలా ఇల్లినాయిస్‌కు చెందినవారు. గ్రిన్నెల్‌ కాలేజ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో లా స్కూల్‌లో ఆమె తన గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసించారు. కొంతకాలం పాటు మాలా న్యాయవాదిగా పనిచేసారు. ఆ తరువాత ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఒబామా అధ్యక్షునిగా ఎన్నిక అయినా తరువాత  అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా మాలా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా కూడా మాలా పని చేసారు. ఆ తరువాత బైడెన్ ఫౌండేషన్ లో విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా మాలా తన బాధ్యతలను నిర్వర్తించారు. 

మాలాతో పాటు, మరో ఇద్దరు క్యాథీ రస్సెల్‌ను వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా, కార్లోస్ ఎలిజోండాను అధ్యక్షుడి ప్రత్యేక సహయకుడిగా  ఎంచుకుంటున్నట్లు జో బైడెన్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, " మా బృందం లో వీరిని అదనపు సిబ్బందిగా చేర్చుకోవడానికి గర్వపడుతున్నట్లు తెలిపారు. ఆపత్కాలంలో వీరి సేవలు అమెరికా దిశా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడతాయని" జో బైడెన్ తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox