Breaking News

విజయవంతంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర

21 st Jul 2021, UTC
విజయవంతంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర

వాషింగ్టన్ :ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. బెజోస్‌ బృందం 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది. ఆయనతో పాటు బెజోస్ సోదరుడు మార్క్, వాలీ ఫంక్, అలివర్ డేమన్ అనే 18 ఏళ్ల యువకుడు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు.

మంగళవారం సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సాస్‌ నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన బ్లూ ఆరిజిన్‌ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్‌ క్రాఫ్ట్. 11 నిమిషాల్లో తిరిగి భూమికి చేరుకుంది. అంతరిక్షయాత్రకు ముందు 45 నిమిషాల ముందే నలుగురు స్పేస్‌ షిప్‌లో కూర్చున్నారు. స్పేస్‌ షిప్‌లో ప్రయాణం, దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి శిక్షణ కార్యక్రమం కూడా ఉంది. జెఫ్ బెజోస్ సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’ ఈ యాత్రను చేపట్టింది.

అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా చేపట్టిన ఈ యాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox