Breaking News

జో బైడెన్ ప్రమాణం: భారతీయుల ఆశలు తీరేనా..?

20 th Jan 2021, UTC

నేటి నుంచి అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి రానుంది. జో బైడెన్ నేడు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే, బైడెన్ అధికారంలోకి వచ్చాక వీసాల విధానాలు మారతాయని భారతీయులు ఆశిస్తున్నారు. ట్రంప్ పరిపాలన హెచ్ 1 బి వీసాదారులను కష్టాల్లోకి నెట్టింది. దీనితో బైడెన్ వచ్చాక అయినా పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నారు. భారతీయలు మాత్రమే కాదు ఇతర దేశాల ప్రజలు కూడా బైడెన్ పాలనా విధానాల పై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

కొత్త అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇమ్మిగ్రేషన్‌ పాలసీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అమెరికాలో భారతీయులు కూడా హెచ్చు సంఖ్యలోనే ఉంటున్నారు. అమెరికాలోని అతి పెద్ద కమ్యూనిటీల్లో ఏసియన్‌ ఇండియన్‌ కమ్యూనిటీ కూడా ఒకటి. అమెరికాలో దాదాపు 42 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నట్లు 'ఇండియాస్పొరా' స్వచ్ఛంద సంస్థ పేర్కొనడం గమనార్హం. టెక్ ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు, వారి కుటుంబాలు ఇలా చాలా మంది ఇమ్మిగ్రేషన్ పాలిసీ ఎలా ఉండబోతోందన్న విషయమై ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

2017నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగు లక్షలుకు చేరుకుంది. ఎక్కువ మంది తెలుగు వారు అక్కడ సాఫ్ట్ వేర్ రంగంలో పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. అయితే, స్థానికులకు అవకాశాలు కల్పించే పేరిట ట్రంప్ వీసాలను కఠినతరం చేసారు. అంతే కాదు ఉద్యోగులను తీసుకునే విషయంలో కూడా స్థానికులకు, గ్రీన్ కార్డు దారులకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలంటూ ట్రంప్ ప్రభుత్వం టెక్ కంపెనీలపై ఒత్తిడి తీసుకురాగలిగింది. ఈ విషయంలో గూగుల్ తో సహా పలు టెక్ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేసాయి. తాజాగా, బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రానున్న నేపధ్యంలో ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉంటాయన్న విషయమై ఆసక్తి నెలకొంది. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox