Breaking News

భారత్ - చైనా మధ్య 13 వ రౌండ్ సైనికచర్చలు విఫలం

11 th Oct 2021, UTC

ఆదివారం భారత్ మరియు చైనా మధ్య 13 వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు చైనా  మొండి వైఖరి కారణంగా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మిగిలిన సమస్యల పరిష్కారంపై చర్చలు జరిగాయని భారత సైన్యం  సోమవారం ఒక ప్రకటనలో,పేర్కొంది.  రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రయోజనాల దృష్ట్యా మిగిలిన సమస్యలను త్వరగా పరిష్కరించడానికి చైనా వైపు కృషి చేస్తుందని భారత సైన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు, పాంగాంగ్ త్సోకు ఉత్తర మరియు దక్షిణాలతో సహా రెండు ప్రదేశాల నుండి భారతదేశం మరియు చైనా సైన్యాలు విడిపోయాయి.

ప్రస్తుత ప్రతిష్టంభనకు చైనా భారతదేశాన్ని నిందించింది.పీపుల్స్ లిబరేషన్  ఆర్మీ యొక్క వెస్ట్రన్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ లాంగ్ షావోవా మీడియాతో మాట్లాడుతూ పరిస్థితిని తప్పుగా అంచనా వేయడానికి బదులుగా, చైనా-ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో కష్టపడి గెలిచిన పరిస్థితిని భారతదేశం గౌరవించాలని అన్నారు. సరిహద్దు పరిస్థితుల సడలింపును ప్రోత్సహించడానికి తమ దేశం "గొప్ప ప్రయత్నాలు" చేసిందని పేర్కొంటూ, చర్చల సమయంలో భారతదేశం "అసమంజసమైన మరియు అవాస్తవికమైన" డిమాండ్లను చేసిందన్నారు చైనా తన జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో ఉందని, రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలనిభారతదేశాన్ని కోరారు.

గత ఏడాద  జూన్ 15 న గాల్వాన్ లోయలో కమాండింగ్ ఆఫీసర్‌తో సహా 21 మంది భారత సైనికులు చనిపోవడంతో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద  పరిస్దితి ఉద్రిక్తంగా మారింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి రెండు వైపుల మధ్య సైనిక కమాండర్ స్థాయి  సమావేశాలు పలు సార్లు జరిగాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox