Site icon Prime9

Imran Khan’s Arrest..ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. దేశవ్యాప్తంగా పిటిఐ కార్యకర్తల నిరసనలు.. ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి

Imran Khan's Arrest

Imran Khan's Arrest

Imran Khan’s Arrest..పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్తంగా అతని మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం మరియు లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ నివాసంపై దాడి చేశారు. ఖాన్ మద్దతుదారులు గుజ్రాన్‌వాలా కంటోన్మెంట్ ప్రవేశాన్ని తగులబెట్టారు. లాహోర్‌లోలిబర్టీ చౌక్ వద్ద గుమిగూడి, జిన్నా హౌస్ వెలుపల నిరసన తెలిపారు. ఆందోళనకారులు టైర్లను తగులబెట్టి సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్మీ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులు హింసాత్మక చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం మోడల్ టౌన్ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసి షెహబాజ్ షరీఫ్ ప్రైవేట్ నివాసానికి నిప్పు పెట్టారు.

నలుగురు పిటిఐ కార్యకర్తల మృతి..(Imran Khan’s Arrest)

నిరసనకారులను అదుపుచేయడానికి జరపిన కాల్పల్లో నలుగురు పిటిఐ కార్యకర్తలు మరణించారు. లాహోర్, ఫైసలాబాద్, క్వెట్టా మరియు స్వాత్‌లలో ఒక్కొక్కరు చనిపోయారని పిటిఐ సీనియర్ నాయకుడు షిరీన్ మజారీ తెలిపారు.డజనుకు పైగా గాయపడ్డారని ఆమె చెప్పారుహింసాత్మక నిరసనలు జరిగిన ప్రావిన్స్‌లోని ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలను నిలిపివేయాలని పంజాబ్ ప్రభుత్వం పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీని అభ్యర్థించింది.అదేవిధంగా, రాజకీయ సంఘటనలు మరియు నిరసనలను నియంత్రించడానికి బలూచిస్తాన్ ప్రభుత్వం క్వెట్టా మరియు ఇతర ప్రదేశాలలో సెక్షన్ 144 విధించింది.ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టును పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టబద్ధమైనదని ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని బుధవారం ప్రకటించింది.

నిరసనలను సమీక్షించడానికి మరియు పరిస్థితిని శాంతింపజేయడానికి వ్యూహాన్ని రూపొందించడానికి ఈ సాయంత్రం కార్ప్స్ కమాండర్ల సమావేశం జరుగుతుంది. పాకిస్థాన్‌లోని ఆర్మీ హెచ్‌క్యూ అధికారులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లాహోర్ నుండి ఇస్లామాబాద్‌కు వెళ్లిన 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఇస్లామాబాద్ హైకోర్టులో బయోమెట్రిక్ ప్రక్రియలో ఉండగా, పారామిలటరీ రేంజర్లు అద్దాలు పగులగొట్టి, లాయర్లు మరియు ఖాన్ భద్రతా సిబ్బందిని కొట్టిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు.గూఢచారి సంస్థ ఐఎస్ఐకి చెందిన సీనియర్ అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని దేశ సైన్యం ఆరోపించిన ఒక రోజు తర్వాత అతని అరెస్టు జరిగింది.

Exit mobile version