Breaking News

బైడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లే... అమెరికా అధ్యక్షుడు ట్రంప్

15 th Oct 2020, UTC

వాషింగ్టన్ :జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే అత్యంత చెత్త అభ్యర్థి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తితో తలపడడం తనకు సిగ్గుచేటుగా ఉందని అన్నారు. లొంగిపోయే అలవాటున్న బైడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లేనన్నారు. పాలనా పగ్గాలు వామపక్ష తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోతాయని అమెరికన్ల ఉద్యోగాలను చైనా లాక్కుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను గెలిస్తే అమెరికన్లు గెలిచినట్లేనని అమెరికా గెలిచినట్లేనని ట్రంప్ అన్నారు.

ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఉద్యోగాలు పోతాయి సరిహద్దులు తెరుస్తారు. అమెరికా సైనికుల తమ రక్తం ధారపోసి పోరాడుతున్నారని అదంతా వృధా అవుతుందని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి అవినీతి నాయకులు పెన్పిల్వేనియాను, దేశాన్ని మోసం చేసారని ఆయన ఆరోపించారు. తాను గెలిస్తే అమెరికా గెలుస్తుందని, పెన్పిల్యేనియా గెలుస్తుందని ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మరోమారు బరిలో నిలివగా మరోపక్క డెమొక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ తలపడుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox