Hamas Commander: గాజా స్ట్రిప్‌లో యాంటీ ట్యాంక్ క్షిపణి కార్యకలాపాలకు బాధ్యత వహించిన సీనియర్ హమాస్ కమాండర్‌ను తొలగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్ ) గురువారం ప్రకటించింది.సెంట్రల్ క్యాంప్స్ బ్రిగేడ్ అని పిలవబడే హమాస్ యొక్క యాంటీ-ట్యాంక్ క్షిపణి శ్రేణికి అధిపతి ఇబ్రహీం అబు-మగ్సిబ్‌ను సైన్యం తొలగించిందని ఐడిఎఫ్ తెలిపింది.
యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగాలు..( Hamas Commander)
ఇబ్రహీం ఇజ్రాయెల్ పౌరులు మరియు ఐడిఎఫ్ సైనికులను లక్ష్యంగా చేసుకుని అనేక యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగాలకు నాయకత్వం వహించాడని ఐడిఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు. ఈరోజు తెల్లవారుజామున గాజాలోని హమాస్ క్షిపణి ప్రయోగ స్థానాలపై ఇజ్రాయెల్ నేవీ బలగాలు దాడి చేశాయని తెలిపారు. ఐడిఎఫ్ పదాతి దళాలు 10 గంటల పోరాటం తర్వాత పశ్చిమ జబాలియాలో అవుట్‌పోస్ట్ 17 అని పిలువబడే హమాస్ బలమైన స్దావరాన్ని స్వాధీనం చేసుకున్నాయని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. వారు హమాస్ మరియు ఇస్లామిక్ జిహాద్ కార్యకర్తలను చంపారని, పలు రకాల ఆయధాలను స్వాధీనం చేసుకున్నారని మిలటరీ తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ నిరవధిక కాలానికి గాజాలో భద్రతకు బాధ్యత వహిస్తుందని చెప్పారు.గాజాను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించడాన్ని అమెరికా వ్యతిరేకించిన తర్వాత ఈ స్పందన రావడం గమనార్హం.ఇజ్రాయెల్‌కు నిరవధిక కాలం పాటు భద్రతా బాధ్యత ఉంటుందని నేను భావిస్తున్నాను.అది లేనప్పుడు ఏమి జరుగుతుందో మేము చూశాము అంటూ నెతన్యాహు ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.