Breaking News

చైనీస్‌ యాప్‌లకు షాక్..!

30 th Jun 2020, UTC
చైనీస్‌ యాప్‌లకు  షాక్..!

చైనీస్‌ యాప్‌లకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. భారత్‌లో 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వం నిషేధం విధించిన వాటిలో టిక్‌టాక్‌, షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. దేశ రక్షణ, భద్రత దృష్ట్యా చైనా యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది.  

చైనీస్‌ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 52 చైనా యాప్స్‌ను నిషేధించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని కోరాయి.


జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందిఘర్షణలో 45 నుంచి 50 మంది చైనా జవాన్లు చనిపోయినా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

17 మంది చైనా సైనికుల మృత దేహాలను భారత్ అప్పగించింది. అంతేకాదు తాము బందీగా పట్టుకున్న చైనా కల్నల్‌ను కూడా భారత్ విడుదల చేసింది. అయితే చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై క్లారిటీ ఇవ్వలేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox