Breaking News

పోలీస్ అధికారి ఇంట్లో బంగారు టాయిలెట్

24 th Jul 2021, UTC
పోలీస్ అధికారి ఇంట్లో బంగారు టాయిలెట్

రష్యాలోని ట్రాఫిక్ పోలీసు అధికారుల లంచాలపై ఉన్నతాధికారులు చేసిన దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వేలాది డాలర్ల ఈ కుంభకోణానికి బాధ్యుడిగా భావిస్తున్న ట్రాఫిక్ పోలీసుల అధిపతి కల్నల్ అలెక్సీ సఫోనోవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో భాగంగ సఫనోవ్ ఇంటిని సందర్శించిన అధికారులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. నైరుతి రష్యా యొక్క స్టావ్రోపోల్ ప్రాంతంలో ఆధునిక ఉన్నతవర్గాల నివాసాల మధ్య వున్న ఈ ఇల్లు రాజప్రాసాదాన్ని తలపించింది. లగ్జరీ వాహనాలు నిలిపి ఉంచి. ఖరీధైన ఇంటీరియర్స్ మరియు పచ్చని పచ్చిక బయళ్ళతో వున్న ఈ  సంపన్న నివాసం యొక్క ఫుటేజీని దర్యాప్తు కమిటీ విడుదల చేసింది

అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇంట్లో టాయిలెట్ బౌల్ బంగారంతో తయారు చేయబడింది. అక్కడ పాలరాతి గచ్చులు వున్నాయి. ఫర్నిచర్, వాల్ ఆర్ట్ ఫ్రేమ్‌ల ను బంగారంతో అలంకరించారు. ఈ కేసులో సఫనోవ్ దోషిగా తేలితే  8 నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్షపడుతుందని ది మాస్కో టైమ్స్ తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox