Breaking News

టాన్సిల్స్‌ సర్జరీ వికటించడంతో మిస్‌ బ్రెజిల్‌ కన్నుమూత

23 rd Jun 2022, UTC

Brazil: వందేళ్ల అందమైన జీవితం అర్ధాంతరంగా ముగిసింది.  ఒక సాధారణ సర్జరీ అనూహ్యంగా ఆమె ప్రాణం తీసింది. కోలుకుంటుందనుకున్న సమయంలో ప్రాణం మీదకు వచ్చింది. ఫలితం, రెండు నెలలు కోమాలో ఉన్న 27 ఏళ్ల ఆ మాజీ సుందరి అనంత లోకాలకు వెళ్లపోయింది. కన్నతల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. మోడలింగ్‌ రంగంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.

బ్రెజిల్‌ మాజీ సుందరి గ్లెసీ కొరియా మోడల్‌‌, బ్యూటీషియన్. 2018లో ఆమె మిస్‌ బ్రెజిల్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తోంది ఆమె. అయితే గొంతు టాన్సిల్స్‌ తొలగించుకునేందుకు ఏప్రిల్‌ 4వ తేదీన ఆమె సాధారణ సర్జరీ చేయించుకుంది. నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లోనే రెండు నెలలపాటు కోమాలో ఉన్న ఆమె, జూన్‌ 20వ తేదీన కన్నుమూసింది.

రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి, మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది కొరియా. ఒక సాధారణ గొంతు టాన్సిల్స్‌ సర్జరీకి ఆమె మృతి చెందడం. ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆమెకు మంగళవారం అంత్యక్రియలు జరిగాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox