Site icon Prime9

Peru: పెరూ బంగారుగనిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..

Peru

Peru

Peru: దక్షిణ పెరూలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో మంటలు చెలరేగడం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు సమాచారం అందించారు.

షార్ట్ సర్క్యూట్ వల్లేనా..(Peru)

దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదం దేశంలోనే అత్యంత దారుణమైన మైనింగ్ విషాదాలలో ఒకటి. మొత్తం 175 మంది కార్మికులను ఖాళీ చేయించినట్లు యానాకిహువా మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చనిపోయిన 27 మంది మైనింగ్‌లో నైపుణ్యం కలిగిన కాంట్రాక్టర్ వద్ద పని చేశారని పేర్కొంది.షార్ట్ సర్క్యూట్ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

.గనిలో పేలుడు సంభవించిన తర్వాత మంటలు చెలరేగాయని స్థానిక మీడియా ప్రాథమికంగా నివేదించింది.పేలుడు ధాటికి గనిలో ఉన్న చెక్క సపోర్టులకు మంటలు అంటుకున్నాయి. కార్మికులు భూమికి 100 మీటర్ల దిగువన ఉన్నారు.రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి.యానాక్విహువా మేయర్ జేమ్స్ కాస్క్వినో చాలా మంది కార్మికులు ఊపిరాడక మరియు కాలిన గాయాలతో చనిపోయారని తెలియజేశారు.ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం లేదు. దీనితో మంటలు చెలరేగినప్పుడు గనిలో ఎంతమంది ఉన్నారనేది నిర్ధారణ కాలేదు.

Exit mobile version