Site icon Prime9

Pakisthan: పాకిస్తాన్ లో ఆర్దిక సంక్షోభం.. ప్లాస్టిక్ సంచుల్లో వంట గ్యాస్

Cooking gas

Cooking gas

Pakisthan: పాకిస్తాన్‌లోని ప్రజలు తమవంట గ్యాస్ అవసరాలను తీర్చుకోవడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగించవలసి వచ్చింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ప్రజలు ఎల్‌పిజిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగించారు, వంట గ్యాస్ సరఫరా కొరత నేపధ్యంలో ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని కరక్ జిల్లాలో ప్రజలకు 2007 నుండి గ్యాస్ కనెక్షన్లు అందించలేదు. హంగు నగరానికి గత రెండేళ్లుగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదు.

గ్యాస్ విక్రేతలు ఒక నాజిల్, వాల్వ్ తో కవర్ ముందు భాగాన్ని మూసివేసే ముందు ప్లాస్టిక్ బ్యాగ్ లోకి పైపు సాయంతో ఎల్‌పీజీ గ్యాస్‌ను నింపుతారు. ఒక ప్లాస్టిక్ సంచిలో మూడు నుంచి నాలుగు కిలోల గ్యాస్ నింపేందుకు గంట సమయం పడుతుందని స్థానిక మీడియా వెల్లడించింది. భారీ సైజులోఉన్న కవర్లలో అత్యంత ప్రమాదకరంగా వంట గ్యాస్ నింపుకొని తీసుకువెడుతున్నట్లు వీడియోలో ఉంది.

ఇవి బాంబులతో సమానమని చాలా ప్రమాదకరమని ఆందోళన నెలకొంది, తాజా వీడియోలతో పాక్ అధికారులు అప్రమత్తమైనట్లు, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు పాక్ మీడియా పేర్కొంది. తీవ్ర ద్రవ్వోల్బణంతో పాటు, పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, దీనికితోడు కరెన్సీ విలువ పతనం వంటి సమస్యలు పాకిస్థాన్ ను వెంటాడుతున్నాయి.

Exit mobile version