Breaking News

డ్రాగన్ గ్యాంబ్లింగ్

14 th Aug 2020, UTC
డ్రాగన్ గ్యాంబ్లింగ్తెలంగాణ:  మోసాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆన్ లైన్లో  మరో భారీ స్కాంను చేధించారు హైదరాబాద్ పోలీసులు. "ఈ కామర్స్" పేరుతో సంస్థల్ని, వెబ్ సైట్లను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు.. ఈ ముసుగులో ఆన్ లైన్ గేముల్ని ప్రోత్సహిస్తూ.. అమాయకుల మీద వల విసురుతున్నాయి. ఆన్ లైన్ గేమ్ పేరుతో మాయచేసే చైనా సంస్థల భాగోతాన్ని బట్టబయలు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆన్ లైన్ గేమ్స్ పేరుతో,  ప్రారంభంలో వేలాది రూపాయల లాభాలను ఆర్జించేలా చేసి - ఆ తరువాత ఏకంగా వేలు, లక్షల రూపాయలకు టోకరా వేసే విదేశీ యాప్ లతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. చైనా, భారత్ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు సంస్థలు - ఆన్ లైన్ గేముల పేరిట  1100 కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఓ చైనీయుడు సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ రాకెట్లో భారతీయులతో పాటు చైనీయులు కూడా ఉన్నారని వెల్లడించారు.

భారతీయుల బలహీనతలను ఆసరాగా చేసుకొని - చాలా విదేశీ సంస్థలు ఆన్ లైన్ మోసాలకి పాల్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్ లైన్ మోసాలకి తెర తీస్తూ, కోట్ల సొమ్ములు లూటీ చేస్తూ ఉంటారు. సొమ్ములు పోయాక గుండెలు బాదుకొని ఆత్మహత్యలు చేసుకోవడం  చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆన్ లైన్ గేమింగ్ లు - ఎప్పటి నుంచో ఇల్లీగల్ గేమ్స్ ని కూడా అఫీషియల్ గా రన్ చేస్తున్నాయి.

వాటిని మళ్ళీ ప్రచారం కూడా చేసుకుంటున్నాయి. మన ఇండియాలో బయట పేకాట, గ్యాంబ్లింగ్ లాంటి ఆటలు ఆడితే చట్టవిరుద్ధం. ఎవరైనా అలా ఆడినట్లు కనిపిస్తే, వారిని ఉన్నపళంగా అరెస్ట్ చేస్తారు. అయితే ఇవే ఆటలు ఆన్ లైన్ లో యధేచ్చగా సాగుతున్నాయి. తాజాగా ఇలాంటి గేమింగ్ కార్యకలాపాలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనిలో చైనా, భారత్ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు సంస్థలు ఆన్ లైన్ గేముల పేరిట 1100 కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని గుర్తించారు. గ్రోయింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్లీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యూన్ టెక్నాలజీస్, డైసీ లింక్ ఫైనాన్షియల్, హువాహో ఫైనాన్షియల్ సంస్థలు ఆన్ లైన్ లో గేమింగ్ పేరిట దోచుకుంటున్నట్టు గుర్తించామని వెల్లడించారు.

ఈ వెబ్ సైట్లు చైనా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఈ సైట్లలో బెట్టింగ్ కు పాల్పడుతూ యువత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని  అంజనీ కుమార్ తెలిపారు. చాలామంది ఈ ఆన్ లైన్ గేమింగ్ లో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ చైనా సైట్లు భారత్ కు చెందిన స్థానిక గేమింగ్ ను ఆధారంగా చేసుకుని మూడు ముక్కలాట, లోనా - బయట, ఇండియన్ రమ్మీ వంటి ఆటలతో యువతకు గాలం వేస్తున్నాయని సీపీ అంజనీ కుమార్ చెప్పారు.

 హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దీనిపై మాట్లాడుతూ  “ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ గేమింగ్ అనేది పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్‌ను నిషేధించింది. ఆన్ లైన్ గేమింగ్ తో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. టెక్స్ట్, ఇమేజ్ బేస్, వీడియో బేస్ ల ద్వారా ఆన్ లైన్ గేమింగ్ నడుస్తున్నాయి. ఇండియా లోని యూత్ ను టార్గెట్ గా చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్ కంపెనీలు మోసం చేస్తున్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా రెఫరెన్స్ తో - ఈ ఆన్ లైన్ గేమింగ్ లోకి ఎంటర్ చేస్తారు. బెట్టింగ్‌తో న‌డిచే ఈ చైనీస్ గేమింగ్ లో బెట్టింగ్ పెట్టి ఎంతో మంది మోసపోతున్నారు. డేటా స్టోరేజ్ అంతా చైనా బేస్డ్ తో క్లాప్డ్ లో సేవ్ అయ్యేలా చూసుకుంటారు.  ఇండియా లో గేమింగ్ ఆడిన డబ్బులు మొత్తం గుర్గావ్ లోని HSBC కి వెళ్ళిందని తెలిపారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంద‌ని సీపీ చెప్పుకొచ్చారు .  సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి ఆధ్వర్యంలో ఈ కేసు  దర్యాప్తు జరుగుతోంది.  

ఒక్క తెలంగాణ , హైదరాబాద్ ల లోనే కాదు  చైనా గ్యాంబ్లింగ్ గేమ్స్ అప్లికేషన్లు దేశవ్యాప్తంగా ఎంతోమంది  వద్ద - డబ్బులు దండుకుంటున్నాయి .  ఈ ఏడాదిలో దేశంలో 1100 కోట్ల టర్నోవర్ చేసిన ఈ ఆన్ లైన్ గేమ్ఇ ప్పటికే  110కోట్లను విదేశాలకు తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఈ కంపెనీకి చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న 30కోట్లను ఫ్రీజ్ చేసినట్లుగా  సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
ఈ ఆన్ లైన్ గేమ్ ను ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించినట్లు చెబుతున్నారు. ఒక కొత్త వ్యక్తి ఇందులో ప్రవేశించిన తర్వాత అతడి ఐపీ అడ్రస్ తో పాటు ఇతర వివరాల్ని సేకరిస్తుంది. మొదట కొన్ని రోజుల పాటు అతను గెలిచేలా చేస్తుంది. దీంతో ఆ ఆటకు బానిసగా మారతారు. తర్వాత కొన్ని గేముల్లో ఓడేలా చేస్తారు. దీంతో కసిగా దాన్ని సాధించాలన్న భావనతో భారీగా ఆడటం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఎక్కువగా డబ్బులు పందానికి పెడతారో అప్పుడు ఓడిపోతారు. ఈ ఆటలో ఇప్పటివరకు సంపాదించిన వారు ఉండరని  మొత్తం మోసపోయే వారే ఉంటారని చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ గేమ్ లో సభ్యుల్ని చేర్పించిన వారికి రిఫరెల్ కోడ్ కు ప్రోత్సాహకంగా  వెయ్యి రూపాయలు ఇస్తారు. అంతేకాదు ఓడిన మొత్తంలో 10 శాతం రాయితీ కూడా ఇస్తారు. ఇలా అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసి భారీగా కొల్లగొట్టటం ఈ మోసం ప్రత్యేకత. ఇంతకీ ఈ గేమ్ ఏమిటంటే కలర్ ప్రిడిక్షన్ గా చెప్పాలి. నేరుగా ఈ ఆట ఆడేందుకు వీల్లేదు. ఎవరో ఒక రిఫరల్ గా మాత్రమే వెళ్లొచ్చు. గేమ్ లోకి వెళ్లాక అక్కడ ఉన్న ఆప్షన్ లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపురంగుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి.

ప్రోగ్రామింగ్ లో రన్ అయి ఒక రంగు దగ్గర వచ్చి ఆగుతుంది. ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్లు డబ్బు వారి పేటీఎం ఖాతాలో జమ అవుతుంది. రాకపోతే ఆ పందెం కాసిన మొత్తం సంస్థకు వెళుతుంది. మొదట్లో గెలిపించి తర్వాత ఓడిస్తూ  అప్పటివరకు గెలిచిన మొత్తంతో పాటు  భారీగా డబ్బులు పోగొట్టుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఈ కంపెనీలు చైనావి కావటం  భారత్ లో వారు డైరెక్టర్లను ఏర్పాటు చేసుకోవటం గమనించదగ్గ విషయం. ఈ కేసులో , పోలీసులు మరింత లోతుల్లోకి వెళితే సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది . ఆన్లైన్ చైనా గేమ్స్ జోలికిపోకుండా - జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది . మర్రిన్ని వార్తలు చదవండి : తెలంగాణ లో కరోనా తగ్గుముఖం పడుతోందా..?

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox