Breaking News

డిగో మారడోనా నన్ను రేప్ చేసాడు.. క్యూబా మహిళ సంచలన ఆరోపణలు

23 rd Nov 2021, UTC

ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా తనపై అత్యాచారం చేశాడని మావిస్ అల్వారెజ్ అనే క్యూబా మహిళ సోమవారం ఆరోపించింది. మారడోనా తన మాదకద్రవ్య వ్యసనం చికిత్స కోసం క్యూబాలో ఉన్నప్పుడు ఇది జరిగిందని  ఆమె మీడియాకు తెలిపింది. ఈ సంఘటన 2001లో జరిగిందని ఆమె పేర్కొంది.

తన తల్లి పక్క గదిలో ఉండగా క్లినిక్‌లో మారడోనా తనపై అత్యాచారం చేశాడని తెలిపిన  అల్వారెజ్ దాని గురించి ఎక్కువగా ఆలోచించడం ఇష్టం లేదని చెప్పింది. మారడోనాకు క్యూబా ప్రభుత్వంతో  మంచి సంబంధాలు ఉన్నందున తన కుటుంబం ఈ విషయాన్ని  అంగీకరించవలసి వచ్చిందని కూడా ఆమె పేర్కొంది.క్యూబా ప్రభుత్వం ప్రమేయం లేకుంటే నా కుటుంబం ఎప్పటికీ అంగీకరించేది కాదని ఆమె తెలిపింది.

అలాగే మారడోనా  క్యూబా  హీరో అయినందున ఏమీ చేయలేని పరిస్దితి కూడ వుందని ఆమె తెలిపింది. పుట్ బాల్ చరిత్రలో మారడోనా దిగ్గజ క్రీడాకారుడిగా పేరుపొందాడు. ఫిఫా అవార్డును దక్కించుకున్న ఇద్దరు విజేతల్లో మారడోనా ఒకడు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox