Marriage in the Flight: వివాహ వేడుక అనేది జీవితాంతం మరచిపోలేని వేడుక కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను కొంతమంది విదేశాలకు కూడ తరలి వెడుతున్నారు. ఇలా ఉండగా తన కుమార్తె ప్రత్యేక రోజును గుర్తుంచుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పాప్లీ ఇటీవల ఒక ప్రైవేట్ విమానంలో వివాహాన్ని నిర్వహించారు.
మూడు గంటల ప్రయాణంలో..(Marriage in the Flight)
నవంబరు 24, శుక్రవారం నాడు దుబాయ్ నుండి ఒమన్‌కు మూడు గంటల ప్రయాణంలో జెటెక్స్ బోయింగ్ 747 విమానంలో వధువు, విధి పోప్లీ, వరుడు హృదేష్ సైనానితో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి బాలీవుడ్ మరియు హాలీవుడ్ ప్రముఖులు, ప్రముఖులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సహా దాదాపు 350 మంది అతిథులు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో షేర్ చేసిన వివాహ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షించింది. ఈ సందర్బంగా వరుడు హృదేష్ మాట్లాడుతూ నా చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం ఒకే పాఠశాలలో చదువుకున్నాం.జెటెక్స్ మాకు వివాహం చేసుకోవడానికి అనుమతించింది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ఇరువురి తల్లిదండ్రులు దిలీప్ పాప్లీ మరియు ముఖేష్ సైనానీలకు నేను రుణపడి ఉంటానని అన్నారు.
ఇలాఉండగా వధువు పోప్లీ కుటుంబానికి ఇది ఆకాశంలో మొదటి వివాహం కాదు.ఆమె తండ్రి దిలీప్ పోప్లే కూడా విమానంలోనే పెళ్లి చేసుకున్నారు. 1994 అక్టోబర్ 18న ముంబై నుంచి అమ్మదాబాద్ వరకూ ప్రయాణించిన ఎయిర్ బస్ A310లో అతను సునీతను వివాహమాడారు. ఇపుడు తాజాగా తన కుమార్తెకు కూడా విమానంలోనే పెళ్లి జరిపించడం విశేషం.