France: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కొత్త వేరియంట్లతో కరోనా వైరస్ ఇప్పటికీ ప్రజలపై దండయాత్రం చేస్తూనే ఉంది. తాజాగా క్రమంగా కేసులు పెరుగుతుండడంతో కొత్త వేవ్ వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నట్లు ఆయన వెల్లడించారు.
ఫ్రాన్స్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు సంఖ్య దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కరోనా కేసుల పెరుగుదలను చూస్తుంటే మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అయితే, కొత్త వేవ్ తీవ్రత ఎంత వరకు ఉంటుందనేది మాత్రం చెప్పలేమన్నారు. కాబట్టి దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా రవాణాలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని ఫిషర్ సూచించారు.
గత నెల చివరి వారం నుంచి ఫ్రాన్స్‌లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏడు రోజుల వ్యవధిలో అక్కడ రోజువారీ కేసులు మూడు రెట్లు పెరగడం ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 27న 17వేల705 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజే 50,402 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా యూరోపియన్ దేశాల్లో ముఖ్యంగా పోర్చుగల్‌లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ సబ్వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వేగంగా వ్యాప్తి చెందడం వల్లే కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీస్ అండ్ కంట్రోల్ వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలే కనిపించడం కొంత ఊరట కలిగించే విషయం. కొత్త వేరియంట్లు రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారితే మాత్రం ఆసుపత్రిలో చేరికలు, మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని ఈసీడీసీ పేర్కొంది.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022