Breaking News

చైనా చావు కబురు..!

06 th Jul 2020, UTC
చైనా చావు కబురు..!
చైనా దేశం నుంచి వచ్చిన కరోనా మహమ్మారి బెడద ఇప్పటివరకు తొలగలేదు..ఎంతో ప్రాణ నష్టం... ఆర్థిక నష్టం తో ఇప్పటికే పలు దేశాలు అల్ల కల్లోల్ల పరిస్థితుల్లో ఉన్నాయి.. అసలు.. ఈ పరిస్థితి నుంచి ఎప్పటికి బయట పడతామో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉంటె.. జి 4 వైరస్ అని కొత్త వైరస్ రాబోతోందని.. స్వైన్ ఫ్లూ తరహా లో ఉంటుందని.. ఇటీవల చైనా వెల్లడించింది. కొందరు ఇది అంత ప్రమాదకరం కాదని చెబుతున్నా... మరో వైపు పరిశోధకులు మాత్రం మన వద్ద మందులు లేవని.. ఈ వైరస్ ను తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేస్తున్నారు.
 
             అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఉంది పరిస్థితి.. ఇది చాలదన్నట్లు.. చైనా లో మరో కొత్త వైరస్ ప్రబలుతోంది.. అసలే కరోనా మహమ్మారి తో హడాలిపోతున్న ప్రపంచ దేశాలకు చైనా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్‌డ్‌ ప్రావిన్స్‌లో ఇటీవల రెండు బుబోనిక్‌ ప్లేగ్‌ వ్యాధి కేసులు బయటపటపడ్డాయని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా ఆదివారం చెప్పుకొచ్చింది. అడవి ఉడుత (మర్మోట్‌) మాంసం అమ్మే వ్యక్తి (27), అతని తమ్మునికి జూలై 1న ప్లేగ్‌ నిర్ధారణ అయిందని చైనా మీడియా స్పష్టం చేసింది. వారిద్దరితో.. కాంటాక్ట్ అయినా 142 మందిని కూడా ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపింది... ఈ బుబోనిక్ ప్లేగ్  వ్యాధి పై మంగోలియా ప్రాంతాలు అలెర్ట్ అయ్యాయి.. బుబోనిక్‌ ప్లేగ్‌ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరీయా కీటకాల ద్వారా ఇతర జంతువులు, మనుషులకు వ్యాప్తిస్తుంది. 
 
              బుబోనిక్ ప్లేగ్  వ్యాధి కూడా ప్రాణాంతకమైనది.. ఈ వ్యాధి సోకినా తరువాత.. ఇరవై నాలుగు గంటల్లో చికిత్స అందకపోతే రోగి మరణించే అవకాశం ఉంటుంది.. ఈ వ్యాధి ప్రాణాంతకమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించింది. ఈ వ్యాధి ఇపుడు కొత్తగా వచ్చింది కాదు.. గత ఏడాది కూడా మంగోలియా లో ఈ వ్యాధి కారణం గా ఇద్దరు మరణించారు. రోనా విషయంలో ప్రపంచాన్ని అలర్ట్‌ చేయలేదనే విమర్శల నేపథ్యంలో చైనా ఇటీవల పందుల నుంచి వ్యాపించే జీ4 వైరస్‌ విషయాన్ని, ఈ ప్లేగు వ్యాధి విషయాన్నీ కూడా  వెలుగులోకి తెచ్చింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox