Breaking News

పీవోకేలో చైనా యుద్ధ విమానాలు..!

29 th Jun 2020, UTC
పీవోకేలో చైనా యుద్ధ విమానాలు..!
పాక్ ఆక్రమిత కాశ్మిర్ లో చైనా గూడుపుఠాణి చేస్తోంది.. శాంతి చర్చలకు సిద్ధమంటూనే.. మరో వైపు యుద్ధానికి సన్నద్ధమవుతోంది. నోటితో మాట్లాడుతూ.. నొసటితో వెక్కిరించడం అంటే ఇదే అని తన చర్యలతో చూపిస్తోంది. డ్రాగన్ చేస్తున్న దూకుడు  పనులకు మరో వైపు పాకిస్థాన్ వంత పాడుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మిర్ లోని స్కర్దు వైమానిక స్థావరం లో.. చైనా తన ఇంధన విమానాన్ని తెచ్చి పెట్టుకుంది. చైనా కు చెందిన గస్తీ విమానాలు కూడా పాకిస్తాన్ లో తిరుగుతున్నాయి. 
 
              భారత్ కూడా.. పక్కలో బల్లెం లా ఉన్న చైనా పై పోరు కు సిద్ధం గానే ఉంది.. చైనా సరిహద్దు గుండా భారీ గా బలగాలను మోహరించింది. వైమానిక బలగాలను, క్షిపణులను సిద్ధం చేసుకుంది. ఆదేశాలు అందగానే.. కేవలం ఎనిమిది నిమిషాల్లో యుద్ధం చేయడానికి భారత్ వైమానిక దళం సిద్ధం గా ఉంది.  ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణం అయినా యుద్ధం జరగొచ్చన్న పరిస్థితి నెలకొంది. భారత్ సరిహద్దు వద్ద.. చైనా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయినా సైన్యాన్ని మోహరించింది. భారత్ కూడా వాయుసేన కు అధునాతనమైన ఆయుధ సంపత్తిని అందిస్తోంది...
 
              గాల్వాన్ లోయ వద్ద డ్రాగన్ చేసిన రాద్ధాంతం తరవాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పొరుగునే ఉన్న పాకిస్తాన్ అగ్నికి ఆజ్యం పోస్తూ చోద్యం చూస్తోంది.. డ్రాగన్ కు చెందిన రీ ఫ్యూ యెలర్ విమానం పాక్ ఆక్రమిత కాశ్మిర్ కు చేరుకుంది. ఈ విమానం యుద్ధ విమానాలకు గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుతుంది. చైనా గస్తీ విమానాలు కూడా సరిహద్దు వద్ద చక్కర్లు కొడుతుండడం తో భారత్ అప్రమత్తమై.. పరిస్థితి ని నిశితం గా గమనిస్తోంది. గగన తల యుద్ధ విమానాలను కూడా సరిహద్దుల్లోకి అనుమతించింది. లడ్డాఖ్  కు భారీ గా అదనపు బలగాలను సమకూర్చింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox