Breaking News

పాకిస్తాన్ కు చైనా డ్రోన్స్..!

06 th Jul 2020, UTC
పాకిస్తాన్ కు చైనా డ్రోన్స్..!
                  భారత్ కు చైనా కు మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం లో.. చైనా ఇంకా తన చర్యలను కొనసాగిస్తూ వస్తోంది.. సరిహద్దు వద్ద డ్రోన్లను ఉపయోగించి పరిస్థితులను సమీక్షిస్తునే ఉంది.. ప్రస్తుతం డ్రాగన్ కంట్రీ వింగ్‌ లూంగ్‌-2 ఆర్మ్‌డ్‌ డ్రోన్లను ఉపయోగిస్తోంది.. అంతే కాదు.. చైనా మిత్రదేశమైన పాకిస్తాన్ కు కూడా డ్రోన్లను అందించి సాయం చేసింది చైనా. అసలే వివాదం ముదురుతున్న నేపధ్యం లో.. చైనా పాకిస్థాన్ కు డ్రోన్లను పంపడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. తాజాగా పాకిస్థాన్ కు శక్తివంతమైన రెండు డ్రోన్ ల ను డ్రాగన్ కంట్రీ  తరలిస్తోంది.
 
                   భారత్ భూభాగం లోకి చైనా మూకలు  చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తున్న నేపధ్యం లో.. భారత్ సైన్యం గట్టి గానే జవాబు చెబుతుంది.. అయితే.. ఇరు దేశాల సైనిక వర్గాలు చర్చించుకోవడం.. అధ్యక్షులు కూడా చర్చించుకోవడం పూర్తి అయ్యాయి.. చర్చల ప్రకారం.. ఒప్పందాల ప్రకారం.. చైనా భారత భూభాగ సరిహద్దు వద్ద తన చర్యలను మానుకోవాల్సి ఉంది. అయితే.. నోటి తో మాట్లాడి.. నొసటి తో వెక్కిరిస్తున్నట్లు ఉంది చైనా వ్యవహారం.. చర్చల సమయం లో సానుకూలం గా ఉండి.. సరిహద్దు వద్ద మాత్రం రెచ్చగొట్టే చర్యలను చేస్తోంది చైనా.
 
                  ఇది ఇలా ఉంటె.. తన చర్యలను సమర్ధించుకుంటూ.. పాకిస్తాన్ ను కూడా తన దారి లోకి తెచ్చుకుంటోంది.. ఈ తరహా లోని.. భారత్ మిత్ర దేశాలైన.. నేపాల్ , భూటాన్ లను కూడా మాటలతో మాయ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. పాకిస్తాన్ కు డ్రోన్లను సాయం చేయడం సైనిక వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.. ఈ డ్రోన్ల సహాయంతో గాల్లో నుంచి ఉపరితలాల మీద ఉన్న లక్ష్యాలను ఛేదించే 12 మిసైళ్ల చొప్పున ఉంటాయి.అయితే ఈ విషయం పై చైనా మాత్రం తన నిర్మాణాలను కాపాడుకునేందుకే డ్రోన్లను పంపిస్తున్నానని చెబుతోంది. 
 
                  చైనా కల్లబొల్లి మాటలను భారత్ ఎప్పటికి నమ్మదు . అందుకే.. వాస్తవాధీన రేఖ వెంబడి.. భారత్  గట్టి సైన్యాన్ని మోహరించింది.. చైనా కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి భారత్ సిద్ధం గా ఉంది. చైనా చర్యలకు పాల్పడితే క్షిపణులతో దాడి చేసేందుకు అమెరికాకు చెందిన ఆల్టిట్యూడ్‌ లాంగ్‌- ఎండ్యూరెన్స్‌ ఆర్మ్‌డ్‌ ప్రెడేటర్‌ బీ- డ్రోన్ల వినియోగంపై అమెరికాతో భారత్‌ సంప్రదింపులు జరుపుతోంది.  మరోవైపు.. అగ్ర దేశాలు కూడా భారత్ కు అండగా నిలుస్తున్నాయి.. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox