Breaking News

భారత్ కు మేము ముప్పు కాదు.. తోక జాడిస్తున్న చైనా..!

31 st Jul 2020, UTC

న్యూఢిల్లీ : అందితే జుట్టు దొరికితే కాళ్ళు పట్టుకునే తత్త్వం చైనా ది. దొరికినంత మేర దోచేసుకుని, అన్యం తెలియని అమాయకురాల్లా నోటి తో మాట్లాడి నొసటితో వెక్కిరించేస్తుంది. మంచినీళ్లు తాగినంత సులభం గా మాయదారి కబుర్లు చెప్పేస్తుంది.

మొన్నటి వరకు  సరిహద్దు వద్ద గట్టి గస్తీ పెట్టి, భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన చైనా ప్రస్తుతం ప్లేటు ఫిరాయించి స్నేహం, దోస్తీ అంటూ కల్లబొల్లి మాటలు చెప్తోంది.

ఉభయ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయాలంటే కొన్ని కీలక అంశాల్లో ఇరు పక్షాల మధ్య స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల ఆ దేశ రాయబారి సన్‌ వేడాంగ్‌  ప్రకటన చేసారు.

        భారత్‌కు చైనా నుంచి ఎలాంటి వ్యూహాత్మక ముప్పు లేదని, ప్రపంచమంతా ఉన్న ఏకైక ముప్పు కరోనా మహమ్మారి అని ఆయన ఈ సందర్భం గా చెప్పుకొచ్చారు. చైనా శాంతి మార్గం లో అభివృద్ధి కోరుకుంటుందని సన్నాయి నొక్కులు నొక్కారు.
 
"భారత్‌కు చైనా ఎప్పుడూ వ్యూహాత్మక ముప్పు కాదు. కంటికి కనిపించని వైరసే ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం. భారత్‌-చైనా మధ్య ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిన చరిత్రను విస్మరించడం హానికరం. తాత్కాలిక విభేదాలు, వివాదాలను బూచిగా చూపి వేల సంవత్సరాల సత్సంబంధాల చరిత్రను మరవడం ఏమాత్రం మంచిది కాదు" అని చైనా రాయబారి ట్విటర్‌ వేదికగా  అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాల మధ్య గురువారం చర్చలు జరిగాయి. గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యం లో ఇటీవల మరోసారి చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం తన అభిప్రాయాలను చైనా రాయబారి వేడాంగ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

 ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయని వేడాంగ్‌ అభిప్రాయపడ్డారు. బలవంతంగా వ్యాపార బంధాలను తెంచుకుంటే రెండు దేశాలు వాణిజ్యపరంగా నష్టపోతాయని చెప్పుకొచ్చారు. చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించడంతో పాటు ప్రభుత్వం పలు కాంట్రాక్టులను రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఆరోపిస్తున్నట్లు, చైనా లో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం లేదని, తైవాన్‌, హాంకాంగ్‌, షింజియాంగ్‌, షీఝాంగ్‌ వంటి వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గత విషయాలని వేడాంగ్ చెప్పుకొచ్చారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోమని, అలానే మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోమని చెప్పారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox