Breaking News

అమెరికా కు అదో వ్యసనం.. : చైనా

01 st Jun 2020, UTC
అమెరికా కు అదో వ్యసనం.. : చైనా
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అలసత్వం వహించిందని... చైనా చేతి లో కీలుబొమ్మ గా మారిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబ్ల్యూహెచ్ఓ పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే.. ట్రంప్ కేవలం ఆరోపించడమే కాకుండా.. డబ్ల్యూహెచ్ ఓ నుంచి నిష్క్రమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయం విషయమై మరో సారి ఆలోచించుకోవాలంటూ ఇప్పటికే.. పలు ఐరోపా దేశాలు ట్రంప్ కు సూచించాయి... ఈ నేపధ్యం లో డ్రాగన్ కంట్రీ చైనా కూడా పలు విమర్శలు చేసింది. అమెరికాకు నిష్క్రమించడం ఓ వ్యసనమైందని చైనా దుయ్య బట్టింది. ఇది ఆ దేశ ఏకపక్షవాదానికి నిదర్శనమని మండిపడింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ..'సంస్థల నుంచి నిష్క్రమించడం, ఒప్పందాలకు స్వస్తి పలకడం అమెరికాకు వ్యసనంగా మారింది' అంటూ ఘాటు విమర్శలు చేసారు.
           "అమెరికా ఫస్ట్" నినాదం తో ట్రంప్ అధ్యక్షుడి గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, యూఎన్‌ కల్చరల్ ఏజెన్సీ యునెస్కో నుంచి బయటకు రావడంతో పాటు, వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందానికి డోనాల్డ్ ట్రంప్ తిలోదకాలిచ్చారు. యుఎన్ వలసల ఒప్పందాన్ని కూడా ట్రంప్ వ్యతిరేకించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox