Pakistan: మసూద్ అజర్ పాకిస్తాన్ లో లేడట.. అడ్రస్ చెప్తే అరెస్ట్ చేస్తారట.!

Pakistan: రోజుకో రకం మాట మాట్లాడటంలో పాకిస్తాన్ ను మించిన దేశం లేదు. తప్పును బుకాయిస్తారు, అబద్దాలను నిజాలని ప్రచారం చేసుకుంటారు. ఒడితే గెలిచామని పండగ చేసుకుని అక్కడి ప్రజల్ని నమ్మిస్తారు. అదోచిత్రవిచిత్రమైన దేశం. అందులో భాగంగానే కరుడు గట్టిన తీవ్రవాది, జైషే – ఎ – మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ లేడని అతని ఆచూకీని చెబితే అరెస్ట్ చేస్తామని పాకిస్తాన్ రాజకీయ నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ ప్రకటన చేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం ప్రపంచం వంతైంది. పాకిస్తాన్ కు సిందూ జలాలను ఆపేసినప్పుడు పాక్ రాజకీయ నాయకుల కంటే ముందు అజర్ స్పందించాడు. పాకిస్తాన్ కు జలాలను ఆపితే రక్తాన్ని పారిస్తానని హెచ్చరించాడు. అజర్ ముందునుంచి పాకిస్తాన్ లో ఉంటున్నాడని నిఘావర్గాలు చెబుతున్నాయి.
2001 భారత పార్లమెంట్ దాడి, 2008లో ముంబై దాడి, 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామా ఆత్మాహుతిదాడిలో అజర్ కు ప్రమేయం ఉంది. భారత్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులలో మసూర్ అజర్ ఒకడు. 2019లో ఐక్యరాజ్య సమితి కూడా అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1994లో భారత్ కు అజర్ చిక్కినప్పటికి 1999లో భారత విమానాన్ని హైజాక్ చేయడంతో అతన్ని విడుదల చేయడం సాధ్యమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు అజర్ భారత్ కు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ బుట్టో అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వూలో అజర్ అఫ్ఘనిస్తాన్ లో ఉండవచ్చని అన్నారు. భారత్ కనుక అజర్ పాకిస్తాన్ లో ఉన్నాడని నిరూపిస్తే, అతని ఆచూకి ఇచ్చినా తాము అరెస్ట్ చేస్తామన్నాడు.