Breaking News

బీరూట్‌ పోర్టులో మరో అగ్ని ప్రమాదం

10 th Sep 2020, UTC
బీరూట్‌ పోర్టులో మరో అగ్ని ప్రమాదం
 
బీరుట్ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  ఆయిల్, టైర్లు నిల్వ ఉంచిన గోడాన్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందగానే అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి లెబనాన్ ఆర్మీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోర్టు సమీపంలోని కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.
 
ఆగష్టు 4న బీరూట్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పోర్టు ప్రాంతంలో అక్రమంగా అమ్మోనియం నైట్రేట్‌లు నిల్వ ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో 191 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. అంతేగాక వేలల్లో ఇళ్లు ధ్వంసంకావడంతో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఈ శిథిలాల తొలగింపు  కొనసాగుతూనే ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox