Breaking News

బాల్యంలో రామాయణం, మహాభారతం కధలను విన్నా.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

17 th Nov 2020, UTC

తన బాల్యంలో ఇండోనేషియాలో గడిపిన కాలంలో రామాయణం మరియు మహాభారతం యొక్క ఇతిహాస కథలను వినడం వల్ల తన దృష్టిలో భారతదేశానికి ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం వుందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ప్రపంచ జనాభాలో ఆరవ వంతు, రెండువేల విభిన్న జాతి సమూహాలు మరియు ఏడు వందలకు పైగా భాషలతో మాట్లాడే  ప్రజలున్న భారత్ విభిన్నమైనదని ఒబామా తన తాజా పుస్తకం 'ఎ'  ప్రామిస్ట్ ల్యాండ్ లో రాసారు.

2010 లో తన అధ్యక్ష పర్యటనకు ముందు తాను భారతదేశానికి ఎన్నడూ రాలేదన్నారు. అయితే తూర్పు మతాల పట్ల తనకున్న ఆసక్తి వల్ల లేదా పాకిస్తానీ మరియు భారతీయ కళాశాల స్నేహితుల బృందం కారణంగా కావచ్చు ఈ ప్రాంతంపై ప్రత్యేక అభిమానం ఏర్పడిందన్నారు.డాల్ మరియు కీమా వంటకాలు. బాలీవుడ్ సినిమాలకు తనను దగ్గర చేసిందని ఒబామా అన్నారు.

"ఎ ప్రామిస్డ్ ల్యాండ్" లో, ఒబామా 2008 ఎన్నికల ప్రచారం నుండి అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను చంపిన సాహసోపేతమైన అబోటాబాద్ (పాకిస్తాన్) దాడివరకు తన ప్రయాణాన్ని వివరించారు. “ఎ ప్రామిస్డ్ ల్యాండ్” రెండు భాగాల్లో మొదటి భాగం మంగళవారం ప్రపంచవ్యాప్తంగా పుస్తక దుకాణాలను చేరింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox