Breaking News

ట్రంప్‌పై అరెస్ట్‌ వారంట్‌..!

29 th Jun 2020, UTC
ట్రంప్‌పై అరెస్ట్‌ వారంట్‌..!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ట్రంప్ కు అరెస్ట్ వారంట్ జారీ అయింది.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.ఇరాన్‌ అగ్రశ్రేణి జనరల్‌ ఖాసిం సొలైమనిని అమెరికా దారుణంగా  హత్య చేసిందని.. ఇరాన్ బలం గా నమ్ముతోంది. బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్‌ దాడి జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా.. ట్రంప్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్.. ట్రంప్ ను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని ఇరాన్‌ ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిచేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన ప్రాసిక్యూటర్‌ ధ్రువీకరించారు.
          ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికాను ట్రంప్‌ ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి ఇరాన్ కు .. అమెరికా కు వివాదం చెలరేగుతూ ఉన్న సంగతి తెలిసిందే. జనవరి మూడో తేదీన బాగ్దాద్‌లో జనరల్ ఖాసిం సొలైమనిని  అమెరికా దళాలు హత్య చేయడం తో ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేంతల పరిస్థితిలు నెలకొన్నాయి. ట్రంప్‌ తన అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రాసిక్యూషన్‌ను ఇరాన్‌ కొనసాగిస్తుందని స్పష్టం చేసాడు.
          ట్రంప్ తో పాటు.. ఇందులో భాగస్వామ్యం ఉన్న కొందరికి కూడా రెడ్ నోటీసు ను జారీ చేయనున్నట్లు అల్కాసిమెహర్ పేర్కొన్నారు. ఈ రెడ్ నోటీసు ను ఇంటర్ పోల్ ఇచ్చే అత్యున్నత స్థాయి అరెస్ట్ అభ్యర్థనను సూచిస్తుందని చెప్పారు. అయితే.. ఈ అరెస్ట్ వారంట్ పై ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లోని లియాన్‌లో ఉన్న ఇంటర్‌పోల్ స్పందించలేదు.. నిపుణులు కూడా ఈ అరెస్ట్ వారంట్ వల్ల ఇపుడిపుడే ట్రంప్ కు ఇబ్బందిఉండదని చెబుతున్నారు. 
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox