Breaking News

పాక్ ఆక్రమిత కాశ్మిర్ లో చైనా పై నిరసనలు .. !

07 th Jul 2020, UTC

చైనా పై పాక్ ఆక్రమిత కాశ్మిర్ లో ఉన్న భారతీయులు నిరసనలు తెలుపుతున్నారు.. ఆర్టికల్ 370 ను ఎత్తివేసిన తరువాత.. జమ్మూ కాశ్మిర్, లడఖ్ పరిసర ప్రాంతాలు భారత్ కు చెందినవే అని.. భారత్ ప్రభుత్వం అధికారికం గా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఓకే కూడా ప్రస్తుతం భారత్ అధీనం లో ఉంది. అయితే.. ఈ ప్రదేశాలని ఆక్రమించడానికి డ్రాగన్ కంట్రీ, దాయాది దేశం పాకిస్థాన్ చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు.. తాజాగా.. పీవోకేలో 1.5కోట్ల డాలర్ల విలువైన ఆజాద్ పత్తాన్ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై చైనా-పాకిస్థాన్‌లు సోమవారం సంతకం చేసాయి.. దీనితో.. అక్కడి ప్రజలు నిరసనలకు దిగారు.  
 
                    అసలు ఏ ప్రాతిపదికన ఈ ప్రాంతం లో ప్రాజెక్ట్ నిర్మించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటారని అక్కడి వారు నిలదీస్తున్నారు. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్‌ నగరంలో అనేక మంది సోమవారం ఆందోళన చేపట్టారు. 'సేవ్‌ రివర్స్‌ సేవ్‌ జమ్మూకశ్మీర్‌'  అనే పేరుతొ.. సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ విషయం లో రెండు దేశాలకు చెందిన అధికారులు  ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. 
 
                     భారత్ ను సంప్రదించకుండా.. పాకిస్థాన్, చైనా లు ఒప్పందాలు కుదుర్చుకుని సంతకాలు చేసుకోవడం పై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణం లో వీరు నిరసనలు చేయడం ప్రాధాన్యత ను సంతరించుకుంది. కోహాలా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే వరకు ఆ ప్రాంతానికి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామని  నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. కోహాలా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే వరకు ఆ ప్రాంతానికి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామని  పాకిస్థాన్ అధికారులు చెప్పుకొచ్చారు. జీలం నదిపై 700 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు వల్ల  విద్యుత్ చౌక గా లభిస్తుందని పాక్ ప్రభుత్వం చెబుతోంది. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox