Breaking News

ట్రంప్ రాజీనామా చేయాలి : అమెరికన్స్

03 rd Jun 2020, UTC
ట్రంప్ రాజీనామా చేయాలి : అమెరికన్స్
ట్రంప్ చేసే వివాదాస్పద వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఒక్కోసారి.. ఎపుడు ఏమి అంటున్నాడో కూడా చాలా మందికి అర్ధం కాదు. ఒక్కోసారి నోరు జారీ మాట్లాడేస్తుంటారు ఆయన. అయితే.. ఆయన దూకుడే ఆయన కొంప ముంచేలా ఉంది.. అమెరికాలో జరుగుతున్న ఆందోళనల విషయంలో కాస్త దూకుడు పెంచి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా వ్యాప్తంగా జాతీయ భద్రతా దళాలను ఆయన మొహరించారు. దాదాపు 15 రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలు దిగి ఆందోళనలు కట్టడి చేస్తున్నాయి.
          అయితే.. వీటివలన పలుచోట్ల హింస పెరిగింది. కొందరు తమ ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ట్రంప్ అమెరికాను పదేళ్ళు వెనక్కు తీసుకుని వెళ్ళారు అని, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు అమెరికాను ఒక దోషిగా చూస్తుందని, అమెరికాను రోడ్డు మీదకు లాగారు అని, ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ కి కాదు ఊపిరి అందనిది… ట్రంప్ కి ఓటు వేసిన అందరికి కూడా అందడం లేదని,మరికొందరైతే... ట్రంప్ అధ్యక్ష పదవి కి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగితే... అమెరికా ఇంకా నాశనం అవుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వచ్చందంగా రాజీనామా చేసి విధుల నుంచి తప్పుకోవడం చాలా మంచిది అని అమెరికన్లు అంటున్నారు. ట్రంప్ ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే మంచిది అని అక్కడి ప్రజలు సూచిస్తున్నారు. మరోవైపు... అధికారుల్లోనూ ఆయన చర్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox