Breaking News

అప్పుల ఊబిలో చిక్కుకున్న అమెరికా...భారత్ కూ భారీ గా బాకీ..!

27 th Feb 2021, UTC

అగ్రదేశం అమెరికా భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. చైనా, భారత్ లతో సహా జపాన్ కు కూడా అమెరికా అప్పు చెల్లించాల్సి ఉంది. ఇటీవల అమెరికా దిగువసభ సభ్యుడు అలెక్స్ మూనీ అగ్ర రాజ్యం అప్పుల గురించి ప్రస్తావించారు. అమెరికా భారత్ కి కూడా అప్పు ఉందట. 216 బిలియన్ డాలర్లను అమెరికా భారత్ కు చెల్లించాల్సి ఉందట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 15 లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది.

2020 సంవత్సరం నాటికే అమెరికా అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ అప్పు  29 ట్రిలియన్లకు చేరుకుంది. ఈ లెక్కన అమెరికా లో ప్రతి పౌరుడిపైనా  72,309 డాలర్ల అప్పు ఉంటుంది. జపాన్, చైనాలకు ట్రిలియన్ డాలర్లపైన అమెరికా అప్పు చెల్లించాలట. మరో వైపు అధ్యక్షుడు జో బైడెన్  1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ క్రమం లో ఉద్దీపనను ప్రకటించే ముందు అప్పుల లెక్కలను కూడా చూసుకోవాలని  అలెక్స్ మూనీ హితవు చెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox