Breaking News

ట్రంప్ కుమార్తె నంటున్న పాక్ యువతి

01 st Dec 2020, UTC
ట్రంప్ కుమార్తె నంటున్న పాక్ యువతి

ఇస్లామాబాద్‌ :పాక్‌ యువతి తాను ట్రంప్‌ కు నిజమైన కుమార్తెని అంటూ ప్రకటించించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో బుర్ఖా ధరించిన ఒక యువతి ట్రంప్‌ ఒరిజనల్‌ కుమార్తెని నేనే అంటూ మీడియాకు తెలిపింది.

ఆమె మీడియాతో మాట్లాడుతూ నేను జోక్‌ చేయడం లేదు. సీరియస్‌గా మాట్లాడుతున్నాను. డొనాల్డ్‌ ట్రంప్‌ నా నిజమైన తండ్రి. నేను మా నాన్నని కలుసుకోవాలని భావిస్తున్నాను. ఆయన నన్ను, మా అమ్మని పట్టించుకోవడం మానేశారు. దీని గురించి మా అమ్మ, ట్రంప్‌తో గొడవపడేది అంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.

ఈ వీడియో 2018, డిసెంబరులో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరో సారి నెట్ లో కనిపించింది. తాజాగా మరోసారి వైరలవుతోంది. అయితే ప్రతిసారి ఈ వీడియోను లక్షల మంది చూడటం విశేషం.  డొనాల్డ్‌ ట్రంప్‌కి‌ ఇవాంకా ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, బారన్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, టిఫనీ ట్రంప్ అంటూ ఐదుగురు సంతానం ఉన్నారు. మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox