Breaking News

బల్లేరియా టూరిస్ట్ బస్సులో చెలరేగిన మంటలు .. 45 మంది మృతి

23 rd Nov 2021, UTC

పశ్చిమ బల్గేరియాలోని హైవేపై మంగళవారం ఒక టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 12 మంది పిల్లలతో సహా 45 మంది మరణించారు.కాలిపోతున్న బస్సు నుండి దూకిన ఏడుగురిని సోఫియాలోని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. 

ప్రమాదానికి కారణం అస్పష్టంగా ఉంది, అయితే బస్సు మంటలు చెలరేగడానికి ముందు లేదా తరువాత దేనినో ఢీకొన్నట్లు కనిపించిందని బల్గేరియన్ అధికారులు తెలిపారు.హైవే మధ్యలో మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైనట్లు టెలివిజన్ ఫుటేజీలు చూపించాయి.

బల్గేరియా తాత్కాలిక ప్రధాన మంత్రి స్టెఫాన్ యానెవ్ విలేకరులతో మాట్లాడుతూ తాను  ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సంఘటన  చూడలేదని అన్నారు.సోఫియాకు పశ్చిమాన 45 కి.మీ (28 మైళ్ళు) దూరంలో ఉన్న స్ట్రుమా హైవేపై తెల్లవారుజామున 2:00 గంటలకు ఈప్రమాదం జరిగింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox