Breaking News

భారత్ సరిహద్దుల వద్ద చైనా చర్యలపై అమెరికా ఆగ్రహం..!

02 nd Jun 2020, UTC
భారత్ సరిహద్దుల వద్ద చైనా చర్యలపై అమెరికా ఆగ్రహం..!
దాదాపు నెల రోజులుగా డ్రాగన్ కంట్రీ సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత్ కు చైనా కు మధ్య ఉన్న వివాదం లో రాయబారం చేయడానికి సిద్ధమని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అయితే.. చైనా చర్యలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా తమ సైనికులను మోహరించిన విషయంపై అమెరికా విమర్శలు గుప్పించింది. నియంతృత్వ ప్రభుత్వాలే ఇటువంటి చర్యలకు పాల్పడతాయని  అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా ప్రభుత్వం చేస్తున్న చర్యలు సరైనవి కావని మైక్  అన్నారు. ఇప్పటికీ చైనా సరిహద్దు వద్ద సైన్యాన్ని మోహరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవైపు కరోనా వైరస్‌ విషయంలో ప్రపంచానికి చైనా నిజాలు తెలియజేయడంలోనూ ఉదాసీనంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. 
             మరోవైపు... హాంకాంగ్ పై బిల్లుని తీసుకొచ్చి.. అక్కడి ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని మైక్ ఆరోపించారు  చైనా ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలకు పాల్పడుతోందని, మేధోహక్కులను కొల్లగొడుతోందని, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఇంకా ప్రయత్నాలు జరుపుతోందని విమర్శించారు. ఇటువంటి నియంతృత్వ తీరును నిరోధించాల్సిన బాధ్యత, సామర్థ్యం అమెరికాకు ఉన్నాయని చెప్పారు. గత కొన్నేళ్లు గా చైనా ఇదే తీరును కనబరుస్తోంది అని చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో చైనా‌ తమ సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటోందని చెప్పారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox