Breaking News

1000 మంది చైనీయుల వీసాలను రద్దు చేసిన అమెరికా

11 th Sep 2020, UTC

అమెరికా: జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు వెయ్యి మందికి పైగా చైనా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. వీరంతా చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉండి, అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చైనా ఆర్మీకి చేరవేస్తున్నారనే అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బానిస కార్మికుల వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువులను కూడా ఇకపై తమ దేశ మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామంటూ అమెరికా ప్రకటించింది.

చైనీయుల వీసాల రద్దుపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అధికార ప్రతినిధి చాద్‌ వాఫ్‌ మాట్లాడుతూ.. కొంతమంది చైనీయులు కరోనా వైరస్‌ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అమెరికా విద్యా విధానాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా చైనా వ్యవహరిస్తోందని, దానికి బదులుగా తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మే 29న చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అధ్యక్షుడి ఉత్తర్వుల నేపథ్యంలోనే 8వ తేదీ నాటికి దాదాపు 1000 మంది చైనా జాతీయుల వీసాలను రద్దు చేశామన్నారు.చైనా దేశ విద్యార్థులు, పరిశోధకుల నుంచి అమెరికా డేటాకు ముప్పు పొంచి ఉన్నందున ఇకపై వారికి తమ దేశంలో ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

 కరోనా విషయంలో చైనాపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.మైనార్టీల పట్ల చైనా వైఖరిని కూడా తప్పుబట్టారు. అంతేకాకుండా జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందంటూ టిక్‌టాక్‌, వీచాట్‌ వంటి యాప్‌లపై అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox